Rammohan Naidu: మత్స్యకారులను క్షేమంగా తీసుకువస్తాం: రామ్మోహన్ నాయుడు
ABN , Publish Date - Oct 23 , 2025 | 03:55 PM
విజయనగరం జిల్లాకు చెందిన మత్స్యకారులను క్షేమంగా తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే విదేశాంగ శాఖ మంత్రితో సంప్రదింపులు జరిపామని వివరించారు. బంగ్లాదేశ్ ఎంబసీతో నిరంతర సంప్రదింపులు, నిశిత పరిశీలన చేస్తున్నామని తెలిపారు.
విజయనగరం, అక్టోబర్ 23: బంగ్లాదేశ్ నేవీ సిబ్బందికి పట్టుబడిన ఎనిమిది మంది జిల్లా మత్స్యకారుల ఘటనపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గురువారం ప్రకటన విడుదల చేశారు. బాధిత కుటుంబాలకు పూర్తి భరోసా కల్పిస్తున్నామని పేర్కొన్నారు. జిల్లాకు చెందిన మత్స్యకారులను క్షేమంగా తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే విదేశాంగ శాఖ మంత్రితో సంప్రదింపులు జరిపామని పేర్కొన్నారు. బంగ్లాదేశ్ ఎంబసీతో నిరంతర సంప్రదింపులు, నిశిత పరిశీలన చేస్తున్నామని తెలిపారు. సముద్ర భద్రత, చట్టం, రక్షణ వ్యవహారాలు చూసే కోస్ట్ గార్డ్ వ్యవస్థతో ఈ సమస్యపై మాట్లాడామని రామ్మోహన్ నాయుడు లేఖలో వివరించారు.
బంగ్లాదేశ్ కోస్టు గార్డుల చెరలో విజయనగరం జిల్లాకు చెందిన 8 మంది మత్స్యకారులు చిక్కుకున్నారు. పూసపాటిరేగ మండలం తిప్పలవలస, భోగాపురం మండలంలోని కొండ్రాజుపాలెం గ్రామాలకు చెందిన వీరు బ్రతుకుదెరువు కోసం వైజాగ్ కు వలస వెళ్లారు. సముద్రంలో చేపల వేట కొనసాగిస్తూ అక్కడే జీవనం సాగిస్తున్నారు. ఈ నెల 13న విశాఖ చేపలరేవు నుంచి మరబోటు (No. MM75)పై సముద్రంలోకి వేటకు వెళ్లారు. ఈ నెల 14న అర్ధరాత్రి 2 గంటల సమయంలో వారు దారితప్పి బంగ్లాదేశ్ కోస్టు గార్డ్ పరిధిలోకి ప్రవేశించారు.
ఇవి కూడా చదవండి:
CM Chandrababu Heavy Rains: భారీ వర్షాలు.. అత్యవసర నిధుల మంజూరుకు సీఎం ఆదేశం