Share News

Minister Anam Fires on Jagan: జగన్ అసెంబ్లీకి రా.. తేల్చుకుందాం..మంత్రి ఆనం స్ట్రాంగ్ సవాల్

ABN , Publish Date - Sep 16 , 2025 | 03:37 PM

వైసీపీ అధినేత జగన్‌ ప్రజాస్వామ్య వాది అయితే అసెంబ్లీకి రావాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సవాల్ విసిరారు. అసెంబ్లీకి రాకుండా కూటమి ప్రభుత్వంపై జగన్ విమర్శలు చేయడం సరికాదని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు.

Minister Anam Fires on Jagan: జగన్ అసెంబ్లీకి రా.. తేల్చుకుందాం..మంత్రి ఆనం స్ట్రాంగ్ సవాల్
Minister Anam Fires on Jagan

నెల్లూరు,సెప్టెంబరు16(ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy)పై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి (Minister Anam Ramanarayana Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ నిజంగా ప్రజాస్వామ్య వాదివి, భారత రాజ్యాంగానికి కట్టుబడ్డ వ్యక్తివి అయితే ఈ సారి జరిగే ఏపీ అసెంబ్లీ సమావేశాలకు రావాలని సవాల్ విసిరారు. ఇవాళ(మంగళవారం) నెల్లూరులో మీడియాతో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడారు. జగన్ ఏమి అడిగినా సమాధానం చెప్పడానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, మంత్రులు అందరూ సిద్దంగా ఉన్నారని స్పష్టం చేశారు‌ ఆనం రామనారాయణ రెడ్డి.


వైసీపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోని సమస్యలను కూడా చెప్పుకునే పరిస్థితిలో వారు లేరని విమర్శించారు‌. 11 నియోజకవర్గాల్లో రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి విరుద్దంగా ప్రజలని గాలికి వదిలేశారని ధ్వజమెత్తారు. జగన్‌కి ఓటు వేసిన వాళ్లకి కూడా న్యాయం చేయడం లేదని విమర్శించారు. దిగజారుడు రాజకీయ వ్యవస్థకి జగన్ వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. ఆయనకి విచక్షణ, విజ్ఞానం, ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదని చెప్పుకొచ్చారు. జగన్ రాజకీయాలకు సరిపోరని ఆక్షేపించారు. వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ రాజీనామా చేయండి.. ఎన్నికలకి వెళ్దామని ఛాలెంజ్ చేశారు. అమ్మ పెట్టదు... అడుక్కుతిననివ్వదనే పరిస్థితిలో జగన్ ఉన్నారని సెటైర్లు గుప్పించారు. జగన్‌కి బుర్ర పనిచేయడం లేదని దెప్పిపొడిచారు ఆనం రామనారాయణ రెడ్డి.


జగన్‌కి కూడా బుర్ర ఉందనే అనుకోని ప్రజలు గెలిపించారని.. కానీ ఐదేళ్ల పాలన తర్వాత ఆయనకు బుర్ర, విజ్ఞానం రెండూ లేవని తేలిపోయిందని విమర్శించారు. రాజకీయ అవినీతిలో కూరుకుపోయిన వ్యక్తి జగన్ అని ఆరోపించారు. వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వంపై నోరు పారేసుకుంటే లాభం ఏముందని ప్రశ్నించారు. ఆత్మకూరులో ఓ పెద్ద మనిషి నోరు పారేసుకుంటున్నారని మండిపడ్డారు. వైసీపీ హయాంలోని ఐదేళ్లలో ఆత్మకూరుకు ఏమి చేశారో ఆయన చెప్పాలని సవాల్ విసిరారు ఆనం రామనారాయణ రెడ్డి.


ఆత్మకూరు గురించి మాట్లాడటానికి కూడా ఆయనకు సిగ్గుండాలని విమర్శించారు. రాజధాని విషయంలో బుర్ర, మతి చెడిపోయిన జగన్‌తో ఏమి మాట్లాడుతామని ఎద్దేవా చేశారు. ఆయనకు తలకాయలో మెదడు లేదు, ఆలోచన శక్తి అంతకన్నా లేదని విమర్శించారు. జగన్‌కి దోచుకోవడం, దాచుకోవడంలో అలవాటు పడి మతి పోయిందని సెటైర్లు గుప్పించారు. గతంలో అమరావతి రాజధాని విషయంలో జగన్ ఏమి చెప్పారో గుర్తు లేదా అని ఆనం రామనారాయణ రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు.


ఈ వార్తలు కూడా చదవండి

రెవెన్యూలో టెక్నాలజీ సమగ్రంగా అమలు చేయండి: సీఎం చంద్రబాబు

మితిమీరిన కోపం వల్ల ఇవన్నీ కోల్పోవలసి ఉంటుంది.!

Read Latest Andhra Pradesh News and National News

Updated Date - Sep 16 , 2025 | 03:52 PM