Buddha Venkanna On YCP Leaders: పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేస్తే ఊరుకునేది లేదు..
ABN , Publish Date - Sep 16 , 2025 | 01:14 PM
టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు పచ్చి మోసగాళ్ళని, కాబట్టే ప్రజలు వారిని 11 సీట్లకే పరిమితం చేశారని విమర్శలు గుప్పించారు.
విజయవాడ: టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు పచ్చి మోసగాళ్ళని, కాబట్టే ప్రజలు వారిని 11 సీట్లకే పరిమితం చేశారని విమర్శలు గుప్పించారు. అమరావతి, విజయవాడపై పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పేర్ని నాని, తన భార్య పేరు మీద బియ్యం నొక్కేసారని, రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు దేవాలయాల భూమి ఆక్రమించుకొని దోపిడీ చేశారని మండిపడ్డారు. ఈ విషయంపై పేర్ని నాని ఎందుకు మాట్లాడటం లేదని బుద్ధా వెంకన్న ప్రశ్నించారు.
నీ మూడు సింహాలు ఎక్కడ?
విజయవాడ ఉత్సవాల కోసం గొల్లపూడిలో స్థలం లీజుకు తీసుకున్నామని, అది అందరికీ తెలిసిన విషయమేనని టీడీపీ నేత బుద్ధా వెంకన్న స్పష్టం చేశారు. వెల్లంపల్లి శ్రీనివాస్‌ను ఎద్దేవా చేస్తూ 'నీ మూడు సింహాలు ఎక్కడ?.. నీ జాతకం రెడ్ బుక్‌లో రాసి ఉంది' అని విరుచుకుపడ్డారు. దేవినేని అవినాష్ కబ్జాల జాతకం అందరికీ తెలిసిన విషయమేనని ఆయన వ్యాఖ్యానించారు.
కుట్రలు చేస్తున్నారు
ఈ ఉత్సవాలను చెడగొట్టేందుకే దేవినేని అవినాష్, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీను కుట్రలు చేస్తున్నారని పేర్కొన్నారు. రాజకీయాలను అడ్డంపెట్టుకొని పేర్ని నాని దోచుకున్నారని, పార్టీ నేతలతో కలిసి ఉత్సవాలపై విషయం చిమ్ముతున్నారని బుద్ద వెంకన్న మండిపడ్డారు.
స్ట్రాంగ్ వార్నింగ్
అమరావతి రాజధానిపై వైసీపీ నేతలు రోజుకో మాట మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. అమరావతి, గుంటూరు, విజయవాడ కలిపి రాజధాని చేస్తున్నామన్నారు. ఇకపై 30 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుందని జోస్యం చెప్పారు. అమరావతి, విజయవాడపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు ఊరుకోరని బుద్ధా వెంకన్న వైసీపీ నేతలను హెచ్చరించారు.
Also Read:
శాసన మండలి చైర్మన్ తరఫు న్యాయవాదికి హైకోర్టు షాక్
మితిమీరిన కోపం వల్ల ఇవన్నీ కోల్పోవలసి ఉంటుంది.!
For More Latest News