Chanakya Quotes on Anger: మితిమీరిన కోపం వల్ల ఇవన్నీ కోల్పోవలసి ఉంటుంది.!
ABN , Publish Date - Sep 16 , 2025 | 12:44 PM
ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో జీవితాలకు సంబంధించిన అనేక విషయాల గురించి వివరించారు. వివాహం, స్నేహం, కెరీర్, విజయం వంటి అనేక అంశాల గురించి ఆయన బోధించారు. అదేవిధంగా, అధిక కోపం వల్ల కలిగే నష్టాలు ఏమిటో కూడా చక్కగా వివరించారు.
ఇంటర్నెట్ డెస్క్: ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో కోపం గురించి వివరించారు. కోపం మానిషికి అతిపెద్ద శత్రువు అని, కోపం వల్ల జీవితంలో ప్రతిదీ కోల్పోవాల్సి వస్తుందని తెలిపారు. మితిమీరిన కోపం ఎప్పుడూ మంచిది కాదని ఆయన చెబుతున్నారు. చాణక్యుడి ప్రకారం మితిమీరిన కోపం వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తుతాయో తెలుసుకుందాం..
సంబంధాలు దెబ్బతింటాయి:
కోపంలో మాట్లాడే కఠినమైన మాటలు సంబంధాలను దెబ్బతిస్తాయి. కాబట్టి, మితిమీరిన కోపం ఎప్పుడూ మంచిది కాదని చాణక్యడు చెబుతున్నారు.
కెరీర్ అడ్డంకులు :
కోపంలో చాలా మంది తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది, అది అతని కెరీర్‌కు ఇబ్బందికరంగా మారవచ్చు. అతిగా కోపంగా ఉండే వ్యక్తులు ఎప్పటికీ మంచి నాయకుడిగా ఎదగలేరని చాణక్యుడు చెబుతున్నారు.
గౌరవం కోల్పోవడం :
తరచుగా కోపంగా ఉండటం వల్ల సమాజంలో ఆ వ్యక్తి ఇమేజ్ దెబ్బతింటుంది. అలాంటి వ్యక్తికి చాలా మంది వీలైనంత దూరంగా ఉంటారు. వారి గౌరవం కూడా క్రమంగా తగ్గుతుంది. కోపంలో తమ భావాలను గాయపరిచే వ్యక్తులతో ఉండటానికి ఎవరు ఇష్టపడరు? ఈ పరిస్థితి ఆ వ్యక్తిని ఒంటరితనం వైపు నెట్టివేస్తుందని చాణక్యుడు అంటున్నారు.
మానసిక ప్రశాంతతను కోల్పోతారు :
కోపం ఒక వ్యక్తి మానసిక ప్రశాంతతను నాశనం చేస్తుంది. ఇది ఒత్తిడి, ఆందోళ, మానసిక అస్థిరతను పెంచుతుంది. కాలక్రమేణా, ఇది ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని చాణక్యుడు చెబుతున్నారు.
తప్పుడు నిర్ణయాలు, పశ్చాత్తాపం :
అతిగా కోపంగా ఉన్నప్పుడు ఆలోచించే, అర్థం చేసుకునే సామర్థ్యం కోల్పోతారు. అటువంటి పరిస్థితిలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాడు. ఈ తప్పుడు నిర్ణయాలు సంబంధాలను నాశనం చేస్తాయి. అతని కెరీర్‌ను దెబ్బతీస్తాయి. కాబట్టి, అధిక కోపం ఎప్పుడూ మంచిది కాదని, మీకు కోపం వచ్చినా, నియంత్రణ కోల్పోకూడదని చాణక్యుడు సూచిస్తున్నాడు.
Also Read:
డెంగ్యూ జ్వరం దరి చేరకూడదంటే.. సింపుల్ చిట్కాలు
పాకాల మృతదేహాల మిస్టరీ.. వివాహేతర సంబంధంపై అనుమానాలు
For More Latest News