ABN Andhrajyothy Effect: ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్.. మంత్రి లోకేష్ ఆదేశాలతో విద్యార్థినికి సాయం..
ABN , Publish Date - Sep 21 , 2025 | 05:17 PM
కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం బూదూరులో సీటు రాక చదువుకు దూరమైన విద్యార్థిని మీనుగ జెస్సీ పొలం పనులు చేస్తోంది. విద్యార్థిని మీనుగ జెస్సీపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం ప్రచురించింది. ఈ కథనానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు.
కర్నూలు, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని మంత్రాలయం మండలం బూదూరులో సీటు రాక చదువుకు దూరమైన విద్యార్థిని మీనుగ జెస్సీ పొలం పనులు చేస్తోంది. విద్యార్థి మీనుగ జెస్సీపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం (ABN Andhrajyothy Article) ప్రచురించింది. ఈ కథనానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (AP Minister Nara Lokesh) స్పందించారు.
బాలికను ఆదుకుంటానని ఎక్స్ వేదికగా మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు. అనంతరం సంబంధిత జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మంత్రి ఆదేశాల మేరకు కలెక్టర్ సిరి, డీఈవో శామ్యూల్ పాల్ చర్యలు చేపట్టారు. చిలకలడోన కస్తూర్బా స్కూల్‌లో 6వ తరగతిలో బాలికను చేర్పించి హాస్టల్ వసతి సైతం కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్‌కు విద్యార్థిని మీనుగ జెస్సీ ధన్యవాదాలు తెలిపారు. కష్టాల్లో ఉన్నవారిని నారా లోకేష్ ఆదుకుంటారని మరోసారి నిరూపించారని కూటమి నేతలు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
జగన్ అసెంబ్లీ రూల్స్ తెలుసుకో.. రఘురామ ప్రశ్నల వర్షం
కరుణాకర్ రెడ్డికి ముందుంది ముసళ్ల పండగ.. భాను ప్రకాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
Read Latest AP News And Telugu News