Share News

PM Narendra Modi On AP Visit: ప్రధాని మోదీ కర్నూలు పర్యటన.. మంత్రి జనార్దన్ రెడ్డి కీలక సూచనలు

ABN , Publish Date - Oct 12 , 2025 | 08:45 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటన నేపథ్యంలో కూటమి నాయకులతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదివారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై పలు కీలక సూచనలు చేశారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.

PM Narendra Modi On AP Visit:  ప్రధాని మోదీ కర్నూలు పర్యటన.. మంత్రి జనార్దన్ రెడ్డి కీలక సూచనలు
PM Narendra Modi On AP Visit

కర్నూలు, నంద్యాల అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఆంధ్రప్రదేశ్ పర్యటన నేపథ్యంలో కూటమి నాయకులతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి (Minister BC Janardhan Reddy) ఇవాళ(ఆదివారం) సన్నాహక సమావేశం నిర్వహించారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై పలు కీలక సూచనలు చేశారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. జీఎస్టీ సంస్కరణలను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు దేశంలో మొదట సమర్థించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అని గుర్తుచేశారు. జీఎస్టీ సమావేశానికి కర్నూలుకు రావాలని ప్రధాని మోదీని కోరారని.. అలాగే, ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలానికి ఆహ్వానించారని తెలిపారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.


bc-janardhan-reddy.jpg

ఉమ్మడి కర్నూలు జిల్లాలో అనేక పరిశ్రమలు: మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

ఉమ్మడి కర్నూలు జిల్లాలో అనేక పరిశ్రమలు, పెట్టుబడులు వస్తున్న క్రమంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా వాటిని ప్రారంభించే లక్ష్యంతో ఇక్కడ జీఎస్టీ సంస్కరణల సమావేశం ఏర్పాటు చేశారని వెల్లడించారు. ఓర్వకల్ ఇండస్ట్రీయల్ కారిడార్‌లో లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు ఏపీకి అవసరమని చెప్పుకొచ్చారు. ప్రధాని సభకు తరలి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రవాణా, ఆహార సదుపాయాల ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు.


ఓర్వకల్లు డ్రోన్ హబ్‌కి ప్రధాని మోదీ శంకుస్థాపన: పల్లా శ్రీనివాసరావు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓర్వకల్లు డ్రోన్ హబ్‌కి ఈనెల 16వ తేదీన శంకుస్థాపన చేస్తారని తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు (Palla Srinivasa Rao) తెలిపారు. రాగ మయూరి గ్రీన్ హిల్స్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లను ఇవాళ(ఆదివారం) పరిశీలించారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. రాబోవు రోజుల్లో ప్రపంచమే ఓర్వకల్లు డ్రోన్ హబ్ వైపు చూస్తుందని వ్యాఖ్యానించారు పల్లా శ్రీనివాసరావు.

Palla Srinivas


ఓవైపు పరిశ్రమలు రావాలని.. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని వామపక్ష నేతలు డిమాండ్ చేస్తారని చెప్పుకొచ్చారు. మరోవైపు పరిశ్రమల శంకుస్థాపనకు కర్నూల్‌కి వస్తున్న ప్రధాని మోదీ గో బ్యాక్ అనడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ఏపీలో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనేదే సీఎం చంద్రబాబు ఆలోచన అని చెప్పుకొచ్చారు. కూటమిలో తాము ఉన్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక దృష్టి పెట్టారని పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ స్కాంలని బయటపెడతాం.. మంత్రి లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్

యువత కలలు సాకారం చేసేందుకు కృషి చేస్తాం: పవన్ కల్యాణ్

For More AP News And Telugu News

Updated Date - Oct 12 , 2025 | 09:00 PM