Share News

Pawan Kalyan on Youth Welfare: యువత కలలు సాకారం చేసేందుకు కృషి చేస్తాం:పవన్ కల్యాణ్

ABN , Publish Date - Oct 12 , 2025 | 04:51 PM

యువత కలలు సాకారం చేసేందుకు తాను కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.యువతకి తానూ ఏ సమయంలోనైనా అండగా ఉంటానని పేర్కొన్నారు.

Pawan Kalyan on Youth Welfare: యువత కలలు సాకారం చేసేందుకు  కృషి చేస్తాం:పవన్ కల్యాణ్
Pawan Kalyan on Youth Welfare

అమరావతి, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): యువత కలలు (Youth Welfare) సాకారం చేసేందుకు తాను కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వ్యాఖ్యానించారు. యువతకి తానూ ఏ సమయంలోనైనా అండగా ఉంటానని పేర్కొన్నారు. యువత కలల సాకారాన్ని నెరవేర్చుకోవడానికి, వారిని అర్థం చేసుకోవడానికి తాను యువతను ఎప్పుడూ కలుస్తూనే ఉంటానని స్పష్టం చేశారు పవన్ కల్యాణ్.


అయితే, ఈ క్రమంలో 2018 అక్టోబరు 12వ తేదీన యువకులతో పవన్ కల్యాణ్ మాట్లాడిన ఫొటోను గుర్తుచేసుకుంటూ.. ఇవాళ(ఆదివారం) సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్ చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్ (Nandendla Manohar). ఈ నేపథ్యంలో ఈ ట్వీట్‌కి స్పందించి అప్పటి విషయాన్ని గుర్తు చేస్తూ రీ ట్వీట్ చేశారు పవన్ కల్యాణ్. తాము యువతతో జరిపిన సంభాషణ తనకు చాలా స్పష్టంగా గుర్తుందని తెలిపారు. ‘యువత ఉచితాలను అడగడం లేదు, వారు ఎలాంటి సంక్షేమ పథకాలను అడగడం లేదు. మాకు 25 సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వండి, ఉచితాలను కాదు’ అని యువత ఆ సమయంలో తనతో గట్టిగా చెప్పారు. యువత సామర్థ్యాన్ని ప్రభుత్వం ఉపయోగించుకోవాలని పవన్ కల్యాణ్ సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ స్కాంలని బయటపెడతాం.. మంత్రి లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్

రెచ్చిపోయిన కానిస్టేబుల్ దంపతులు.. పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు

For More AP News And Telugu News

Updated Date - Oct 12 , 2025 | 05:00 PM