Lokesh Fires on Jagan: జగన్ స్కాంలని బయటపెడతాం.. మంత్రి లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్
ABN , Publish Date - Oct 12 , 2025 | 02:45 PM
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీసీఎస్, కాగ్నిజెంట్ సంస్థలకి 99 పైసలకి భూమిని కేటాయించడం తప్పా అని ప్రశ్నించారు.
విశాఖపట్నం, అక్టోబరు12(ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy)పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ చేసిన స్కాంలు అన్నింటిని బయటపెడుతామని హెచ్చరించారు. తప్పు చేసిన వైసీపీ నేతలని ప్రజా కోర్టులో దోషులుగా నిలబెడతామని వార్నింగ్ ఇచ్చారు. టీసీఎస్, కాగ్నిజెంట్ సంస్థలకి 99 పైసలకి భూమిని కేటాయించడం తప్పా అని ప్రశ్నించారు. ఈ విషయంలో జగన్, కోడి గుడ్డు మంత్రి సమాధానం చెప్పాలని నిలదీశారు. రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులకు.. గ్రేటర్ విశాఖపట్నం 50 శాతం ఏకనామిక్ రీజనల్‌లో ఉంటుందని స్పష్టం చేశారు. ఇవాళ(ఆదివారం) విశాఖపట్నంలో మొదటి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్, ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్(CLS)లకి మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు.
విశాఖపట్నానికి ప్యాలెస్‌లు కట్టాలని టీసీఎస్, కాగ్నిజెంట్ సంస్థలు రావడం లేదని చెప్పుకొచ్చారు. టీసీఎస్‌కి నవంబర్‌లో.. కాగ్నిజెంట్‌కి డిసెంబర్‌లో శంకుస్థాపన చేస్తారని తెలిపారు. నవంబర్ 14, 15వ తేదీల్లో పెట్టుబడుల సదస్సు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. గూగుల్ ప్రతినిధులను తాము రేపు(సోమవారం) కలుస్తున్నామని తెలిపారు. సింగిల్ లార్జెస్ట్ ఇన్‌వెస్ట్‌మెంట్ సంస్థలని విశాఖపట్నానికి తీసుకువస్తున్నామని వెల్లడించారు మంత్రి నారా లోకేష్.
గ్రేటర్ ఏకనామిక్ రీజియన్‌ని తయారు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. రాబోయే ఐదేళ్లలో ఐదు లక్షల ఉద్యోగాలే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఉద్ఘాటించారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, ఆభివృద్ది వికేంద్రీకరణ లక్ష్యంతో తాము పనిచేస్తున్నామని వివరించారు. అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. ఏపీ ప్రజలను ఒప్పించి, అభివృద్ధి చేసి, పెట్టుబడులు తీసుకువస్తామని చెప్పుకొచ్చారు. శ్రీకాకుళం, విశాఖపట్నం, అరకు, పాడేరు ప్రాంతాలని కలుపుతూ ఇంటిగ్రేడేట్ అప్రోచ్‌తో పనిచేస్తామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ట్విస్ట్ ఇచ్చిన వైద్య సిబ్బంది.. ఏఐజీ వద్ద ఉద్రిక్తత
రెచ్చిపోయిన కానిస్టేబుల్ దంపతులు.. పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు
For More AP News And Telugu News