Share News

TDP Victory: జగన్ కంచుకోటకు బీటలు.. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ ఘన విజయం

ABN , Publish Date - Aug 14 , 2025 | 11:14 AM

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి కంచుకోటకు బీటలు వారాయి. పులివెందుల బైపోల్‌ జగన్‌ నాయకత్వానికి గొడ్డలిపెట్టు అయింది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ విజయ బావుటా ఎగురవేసింది. టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి ఘన విజయం సాధించారు.

TDP Victory: జగన్ కంచుకోటకు బీటలు.. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ ఘన విజయం
Pulivendula ZPTC BYE Election

కడప, ఆగస్టు14 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) కంచుకోటకు బీటలు వారాయి. పులివెందుల బైపోల్‌ జగన్‌ నాయకత్వానికి గొడ్డలిపెట్టు అయింది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో (Pulivendula ZPTC BYE Election) తెలుగుదేశం పార్టీ విజయ బావుటా ఎగురవేసింది. టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి (Latha Reddy) 6,735 ఓట్లతో ఘన విజయం సాధించారు. 6,050 ఓట్ల మెజారిటీతో లతారెడ్డి గెలిచారు. లతారెడ్డి గెలుపుతో పులివెందులలో వైసీపీ అభ్యర్థి హేమంత్‌రెడ్డి (Hemanth Reddy) డిపాజిట్ కోల్పోయారు. వైసీపీ అభ్యర్థి హేమంత్‌రెడ్డి కేవలం 685 ఓట్లు మాత్రమే సాధించారు. లతారెడ్డి గెలుపుతో పసుపు సైనికులు సంబురాలు చేసుకుంటున్నారు. ప్రజలు వీధుల్లోకి వచ్చి లతారెడ్డిని ఆశీర్వదిస్తున్నారు. లతారెడ్డి గెలుపుతో పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచిందని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


Latha-Reddy.jpg

మరోవైపు.. ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. టీడీపీ అభ్యర్థి ముద్దుకృష్ణారెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. కడప పాలిటెక్నిక్ కాలేజ్‌లో కౌంటింగ్ కొనసాగుతోంది. రెండు రౌండ్లలో ఒంటిమిట్ట జెడ్పీటీసీ కౌంటింగ్ ప్రక్రియ పూర్తికానుంది. పులివెందుల, ఒంటిమిట్ట బరిలో 11 మంది చొప్పున అభ్యర్థులు బరిలో నిలించారు. టీడీపీ, వైసీపీ అభ్యర్థుల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. పులివెందులలో 74శాతం, ఒంటిమిట్టలో 86 శాతం ఓటింగ్ నమోదైంది. ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి ముద్దుకృష్ణారెడ్డి ఆధిక్యంలో ఉన్నారు.


కడప పాలిటెక్నిక్ కళాశాలలో పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉపఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జరిగింది. ఒకే రౌండ్‌లో పులివెందుల జెడ్పీటీసీ కౌంటింగ్ పూర్తి అయింది. పులివెందుల జెడ్పీటీసీ కౌంటింగ్‌కు పది టేబుళ్లు ఏర్పాటు చేశారు. అలాగే ఒంటిమిట్ట జెడ్పీటీసీ కౌంటింగ్‌కు పది టేబుళ్లు ఏర్పాటు చేశారు. రెండు రౌండ్లలో ఒంటిమిట్ట జెడ్పీటీసీ కౌంటింగ్ పూర్తిఅయింది. ఒక్కో టేబుల్‌పై 1,000 ఓట్లు లెక్కించేలా ఏర్పాట్లు చేశారు. అయితే, ఎన్నికలు ఏకపక్షంగా జరిగాయని ఆరోపిస్తూ కౌంటింగ్‌‌ను వైసీపీ నేతలు బహిష్కరించిన విషయం తెలిసిందే.


ఈ వార్తలు కూడా చదవండి..

ప్రజలకు భయం పోయింది.. జగన్‌కు పట్టుకుంది

జగన్‌కు దమ్ముంటే మోదీ, షాపై పోరాడాలి

For More AndhraPradesh News And Telugu News

Updated Date - Aug 14 , 2025 | 11:58 AM