Palla Srinivasa Rao: తెలుగు తమ్ముళ్లు క్రమశిక్షణతో పని చేయాలి.. పల్లా శ్రీనివాసరావు కీలక ఆదేశాలు
ABN , Publish Date - Nov 05 , 2025 | 06:41 PM
మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు ఇకపై ప్రతి శుక్రవారం ప్రతి నియోజకవర్గంలో గ్రీవెన్స్ నిర్వహించాలని టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆజ్ఞాపించారు. ఇక అదే రోజు స్థానిక నాయకులతో సమావేశం నిర్వహించి నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు పల్లా శ్రీనివాసరావు .
అమరావతి, నవంబరు5 (ఆంధ్రజ్యోతి): తెలుగు తమ్ముళ్లు క్రమశిక్షణతో పని చేయాలని తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు (Palla Srinivasa Rao) ఆదేశాలు జారీ చేశారు. నేతలు ఎవరైనా పార్టీ లైన్ దాటి వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఇకపై ప్రతి శుక్రవారం గ్రీవెన్స్ నిర్వహించాలని సూచించారు. ఇవాళ(బుధవారం) అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో పార్టీ నాయకులతో పల్లా శ్రీనివాసరావు టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు తమ్ముళ్లకి పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు పల్లా శ్రీనివాసరావు.
ఈనెల15వ తేదీలోపు గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ కమిటీల వరకు నియామకాలు పూర్తి చేయాలని హుకుం జారీ చేశారు. కూటమి నాయకులతో సఖ్యతగా, సమష్టిగా ఉంటూ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆజ్ఞాపించారు. మంగళగిరి నియోజకవర్గంలో గ్రీవెన్స్‌ని సరిగా ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రజా సమస్యలపై సరైన రీతిలో పరిష్కరించి ఉంటే మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) ప్రజాదర్బార్ (Praja Darbar)కు నాలుగు వేల మంది ఎందుకు వస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు పల్లా శ్రీనివాసరావు.
నారా లోకేష్ ఆదేశాల మేరకు ఇకపై ప్రతి శుక్రవారం ప్రతి నియోజకవర్గంలో గ్రీవెన్స్ నిర్వహించాలని ఆజ్ఞాపించారు. ఇక అదే రోజు స్థానిక నాయకులతో సమావేశం నిర్వహించి నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. నవంబరు 15వ తేదీలోపు నియోజకవర్గ కమిటీల నుంచి గ్రామస్థాయి కమిటీల వరకు పార్టీ నియామకాలు పూర్తి చేయాలని డెడ్ లైన్ విధించారు. 15వ తేదీలోపు నియామకాలు పూర్తి చేయలని హుకుం జారీ చేశారు. పూర్తి చేయలేకపోతే అందుకు కారణాలని వివరించాలని, లేకపోతే టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandra babu Naidu) ఎదుట ఆయా నేతలు హాజరుకావాల్సి ఉంటుందని పల్లా శ్రీనివాసరావు హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్
భారీ పెట్టబడులు, ఒప్పందాలకు విశాఖ వేదిక.. మంత్రి డీబీవీ స్వామి కీలక వ్యాఖ్యలు
Read Latest AP News And Telugu News