Minister Manohar: తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు: మంత్రి నాదెండ్ల
ABN , Publish Date - Oct 27 , 2025 | 07:30 PM
మొంథా తుపాను హెచ్చరికల నేపథ్యంలో ప్రజలకు క్షేత్రస్థాయిలో సేవలందించేందుకు పౌర సరఫరాల శాఖ సిద్ధమైందని ఆ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. ఏపీవ్యాప్తంగా 12 జిల్లాల్లో తుఫాను ప్రభావం అత్యధికంగా ఉందని చెప్పుకొచ్చారు నాదెండ్ల మనోహర్.
అమరావతి, అక్టోబరు27 (ఆంధ్రజ్యోతి): మొంథా తుపాను (Montha Cyclone) హెచ్చరికల నేపథ్యంలో ప్రజలకు క్షేత్రస్థాయిలో సేవలందించేందుకు పౌర సరఫరాల శాఖ సిద్ధమైందని ఆ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ (Minister Nadendla Manohar) వ్యాఖ్యానించారు. ఏపీవ్యాప్తంగా 12 జిల్లాల్లో తుపాను ప్రభావం అత్యధికంగా ఉందని చెప్పుకొచ్చారు. శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, వెస్ట్ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లాల్లో రేపు(మంగళవారం) ఉదయం 9 గంటల నుంచి రేషన్ షాపుల్లో నిత్యావసరాల సరుకులు అందజేస్తామని వెల్లడించారు మంత్రి నాదెండ్ల మనోహర్.
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సేవలు అందించేందుకు పౌర సరఫరాలశాఖ సిద్ధంగా ఉందని వివరించారు. 12జిల్లాల్లో 14,145...రేషన్ షాపులు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు. 7లక్షలమంది లబ్ధిదారులకు ఉపయోగపడేలా నిత్యావసరాలు అందుబాటులో ఉంచామని తెలిపారు. విద్యుత్ సరఫరా లేని ప్రాంతాల్లో జనరేటర్స్ అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పుకొచ్చారు మంత్రి నాదెండ్ల మనోహర్.
జనరేటర్స్‌కు అవసరమైన డీజిల్, కిరోసిన్ కూడా అందుబాటులో ఉంచామని తెలిపారు. 12 జిల్లాల్లో 626 పెట్రోల్, డీజిల్ ఆయిల్ కంపెనీ అవుట్‌లెట్లు ఉన్నాయని వివరించారు. పెట్రోల్, డీజిల్ కొరత లేకుండా ఉండేందుకు కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి 3,543 లీటర్ల పెట్రోల్, డీజిల్స్‌ని అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టామని తెలిపారు. అన్నదాతలకు 30,000 టార్పాలిన్లు అందుబాటులో ఉంచామని... వీటిని వినియోగించుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఇంద్రకీలాద్రి ఆలయ ప్రాంగణంలో రాజకీయ వ్యాఖ్యలు చేయొద్దు.. పాలక మండలి విజ్ఞప్తి
మొంథా తుపానుపై పవన్ కల్యాణ్ అలర్ట్.. అధికారులకు దిశానిర్దేశం
Read latest AP News And Telugu News