Indrakiladri Durga Temple: ఇంద్రకీలాద్రి ఆలయ ప్రాంగణంలో రాజకీయ వ్యాఖ్యలు చేయొద్దు.. పాలక మండలి విజ్ఞప్తి
ABN , Publish Date - Oct 27 , 2025 | 02:27 PM
విజయవాడ కనకదుర్గా మల్లేశ్వర స్వామి ఆలయ పరిధిలో ఎలాంటి రాజకీయ విమర్శలు చేయొద్దని పాలకమండలి సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఇంద్రకీలాద్రి ఆలయ ప్రాంగణం పవిత్రమైనదని.. దయచేసి అమ్మవారి ప్రాంగణంలో రాజకీయ ఉపన్యాసాలు, రాజకీయ ఆరోపణలు చేయటం మానుకోవాలని పాలకమండలి సభ్యులు సూచించారు.
విజయవాడ, అక్టోబరు27 (ఆంధ్రజ్యోతి): విజయవాడ కనకదుర్గా మల్లేశ్వరస్వామి ఆలయ (Vijayawada Kanakadurga Malleswara Swamy Temple) పరిధిలో ఎలాంటి రాజకీయ విమర్శలు చేయొద్దని పాలకమండలి సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రాజకీయ పక్షాలు అందరికీ కీలక విజ్ఞప్తి చేశారు. ఇంద్రకీలాద్రి ఆలయ ప్రాంగణం పవిత్రమైనదని.. దయచేసి అమ్మవారి ప్రాంగణంలో రాజకీయ ఉపన్యాసాలు, రాజకీయ ఆరోపణలు చేయటం మానుకోవాలని సూచించారు పాలకమండలి సభ్యులు.
దుర్గగుడి ప్రాంగణం, ఘాట్ రోడ్డు, కామదేను అమ్మవారి ఆలయం, కనకదుర్గానగర్ సమీప ప్రాంతాల్లో ఎలాంటి రాజకీయ అంశాలకు తావులేదని స్పష్టం చేశారు పాలకమండలి సభ్యులు. దేవాలయ సమీపంలో ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయకూడదని చెప్పుకొచ్చారు. ఆలయాలకు రాజకీయాలను ముడిపెట్టే ప్రయత్నం ఏమాత్రం చేయొద్దని విన్నవించారు. ఈ నేపథ్యంలో ఇంద్రకీలాద్రి దేవస్థానం పాలకమండలి ఓ ప్రకటన విడుదల చేసింది.
ఇవి కూడా చదవండి..
మొంథా తుఫాన్.. సీఎం చంద్రబాబుకు ప్రధాని ఫోన్
బస్సు దగ్ధం ఘటన.. డెడ్‌బాడీస్ అప్పగింత పూర్తి
Read latest AP News And Telugu News