Share News

Cyclone Montha: మొంథా తుపాన్.. సీఎం చంద్రబాబుకు ప్రధాని ఫోన్

ABN , Publish Date - Oct 27 , 2025 | 12:47 PM

మొంథా తుపాన్ ప్రభావంపై సచివాలయం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. మొంథా తుపాన్‌పై ఆర్టీజీఎస్‌లో అధికారులతో చర్చించారు.

Cyclone Montha: మొంథా తుపాన్.. సీఎం చంద్రబాబుకు ప్రధాని ఫోన్
Cyclone Montha

అమరావతి, అక్టోబర్ 27: మొంథా తుపాన్ (Cyclone Montha) రాష్ట్రం వైపు దూసుకొస్తోంది. దీంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం అన్ని విధాలుగా చర్యలు చేపట్టింది. ఇక మొంథా తుపాన్ ప్రభావంపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో (CM Chandrababu Naidu) ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) ఫోన్లో మాట్లాడారు. కేంద్ర సాయం పూర్తి స్థాయిలో ఉంటుందని ప్రధాని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో ప్రధాని కార్యాలయంతో సమన్వయం చేసుకోవాలని మంత్రి నారా లోకేష్‌కు (Minister Nara Lokesh) సీఎం సూచించారు.


ఇక మొంథా తుపాన్ ప్రభావంపై సచివాలయం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. తుపాన్‌పై ఆర్టీజీఎస్‌లో మంత్రులు, అధికారులతో చర్చించారు. ప్రతీ గంటకు తుపాన్ కదలికలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వర్షాలు, వరదలకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. కాలువ గట్లు పటిష్టం చేసి పంట నష్టం జరగకుండా చూడాలని అధికారులకు చెప్పారు. ఈ సమీక్షలో మంత్రులు లోకేష్, అనిత, సీఎస్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


మరోవైపు ప్రస్తుతం కాకినాడకు 680 కి.మీ దూరంలో ఉన్న మొంథా తుపాన్.. 16 కి.మీ వేగంతో తీరాన్ని సమీపిస్తోంది. దీని ప్రభావంతో ఈరోజు, రేపు కృష్ణా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, పల్నాడు, పశ్చిమ గోదావరి జిల్లాలకు భారీ వర్షాలు పడనున్నాయి. రేపు రాత్రికి తుపాన్ తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.


ఇవి కూడా చదవండి

బస్సు దగ్ధం ఘటన.. డెడ్‌బాడీస్ అప్పగింత పూర్తి

ముళ్లకంపలోకి దూసుకెళ్లిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.. ఎక్కడంటే

Read latest AP News And Telugu News

Updated Date - Oct 27 , 2025 | 05:11 PM