Share News

Kurnool Bus Fire: బస్సు దగ్ధం ఘటన.. డెడ్‌బాడీస్ అప్పగింత పూర్తి

ABN , Publish Date - Oct 27 , 2025 | 11:43 AM

నిన్నటి వరకు 18 మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించారు. శుక్రవారం (ఈనెల 24న) ప్రమాదం జరుగగా అదే రోజు అర్ధరాత్రి రెండు గంటల వరకు డాక్టర్లు 16 బృందాలుగా ఏర్పడి డెడ్‌బాడీస్‌కు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించారు.

Kurnool Bus Fire: బస్సు దగ్ధం ఘటన.. డెడ్‌బాడీస్ అప్పగింత పూర్తి
Kurnool Bus Fire

కర్నూలు, అక్టోబర్ 27: కర్నూలులో జరిగిన బస్సు ప్రమాద (Kurnool Bus Accident) ఘటనలో నేటితో మృతదేహాల అప్పగింత పూర్తి అయ్యింది. ఈరోజు (సోమవారం) ఉదయం తమిళనాడు రాష్ట్రానికి చెందిన ప్రశాంత్ (29) మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు అధికారులు. కర్నూలు ఎమ్మార్వో ఆంజనేయులు, పోలీసుల సమక్షంలో కర్నూలు స్మశాన వాటికలో ప్రశాంత్ మృతదేహానికి కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. కాగా.. ఈనెల 24న జిల్లాలో జరిగిన బస్సు దగ్ధం ఘటనలో 19 మంది సజీవదహనం అయిన విషయం తెలిసిందే. మృతదేహాలను డీఎన్‌ఏ నివేదిక ఆధారంగా కుటుంబసభ్యులకు అధికారులు అప్పగించారు.


నిన్నటి వరకు 18 మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించారు. శుక్రవారం (ఈనెల 24న) ప్రమాదం జరుగగా అదే రోజు అర్ధరాత్రి రెండు గంటల వరకు డాక్టర్లు 16 బృందాలుగా ఏర్పడి డెడ్‌బాడీస్‌కు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించారు. బంధువుల డీఏఎన్‌ తీసుకుని అదే రోజు పరీక్ష నిమిత్తం మంగళగిరి ల్యాబ్‌కు పంపించారు. ఆదివారం ఉదయం డీఎన్‌ఏ రిపోర్టులు రావడంతో మృతదేహాలను బంధువులకు అప్పగించే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. డీఎన్‌ఏ రిపోర్టుల మ్యాచింగ్ ప్రకారం మృతదేహాలను వారివారి కుటుంబసభ్యులకు హ్యాండోవర్ చేశారు.


మృతదేహాలతో పాటు డీఎన్‌ఏ రిపోర్టు, పోస్టుమార్టం రిపోర్టులను కూడా ఇచ్చారు. నిన్ననే 18 మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించేశారు. ఇక బీహార్‌కు చెందిన మృతుడి అంత్యక్రియలను కుటుంబసభ్యుల అభ్యర్థనతో కర్నూలులోనే పూర్తి చేశారు. అలాగే ఈరోజు 19వ మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. దీంతో తమిళనాడుకు చెందిన ప్రశాంత అంత్యక్రియలు కూడా కుటుంబసభ్యుల వినతితో కర్నూలులోనే పూర్తి అయ్యాయి.


ఇవి కూడా చదవండి

ముంచుకొస్తున్న మొంథా.. మూడు రోజులు సెలవులు

కార్తీక మాసం మొదటి సోమవారం.. పిఠాపురం పాదగయ క్షేత్రానికి పోటెత్తిన భక్తజనం

Read latest AP News And Telugu News

Updated Date - Oct 27 , 2025 | 12:01 PM