Private Travels Bus Accident: ముళ్లకంపలోకి దూసుకెళ్లిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.. ఎక్కడంటే
ABN , Publish Date - Oct 27 , 2025 | 10:49 AM
ఆర్టీవీ ప్రైవేటు ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం జరిగింది. ప్రకాశం జిల్లా కోమటికుంట దగ్గర బస్సు అదుపుతప్పి ముళ్లకంపలోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో 8 మంది ప్రయాణికులు మాత్రమే ఉన్నారు.
ప్రకాశం, అక్టోబర్ 27: ఏపీలో వరుసగా జరుగుతున్న బస్సు ప్రమాదాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. మొన్న కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం ఘటన ఎలాంటి విషాదాన్ని నింపిందో అందరికీ తెలిసిందే. హైదరాబాద్ నుంచి బెంగళూరు బయలుదేరిన ప్రయాణికుల్లో చాలా మంది తెల్లవారే సరికి సజీవదహనం అయ్యారు. మరికొందరు ప్రాణాలతో బయటపడ్డారు. ఇక ఆ ప్రమాదం జరిగిన తర్వాత వరుసగా రాష్ట్రంలో పలు చోట్ల ప్రైవేటు బస్సులు, స్కూల్ బస్సులకు ప్రమాదాలు జరిగాయి. అయితే అందులో ఉన్న ప్రయాణికులు, విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే రాష్ట్రంలో మాత్రం రోజుకో బస్సు ప్రమాదాలు జరుగుతూనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ప్రకాశం జిల్లాలో ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది.
ఈరోజు (సోమవారం) ఆర్టీవీ ప్రైవేటు ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం జరిగింది. ప్రకాశం జిల్లా కోమటికుంట దగ్గర బస్సు అదుపుతప్పి ముళ్లకంపలోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో 8 మంది ప్రయాణికులు మాత్రమే ఉన్నారు. అయితే ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. వెంటనే బస్సులోని ప్రయాణికులు బస్సు దిగి వేరే వాహనాలలో తమ ప్రయాణాన్ని సాగించారు. ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇక కర్నూలు బస్సు ప్రమాద ఘటన తర్వాత ఆర్టీఏ అధికారులు చర్యలు చేపట్టారు. ఎక్కడిక్కడ తనిఖీలు నిర్వహించి నిబంధలు పాటించని అనేక ప్రైవేటు బస్సులపై కేసులు నమోదు చేశారు. పలు బస్సులను సీజ్ చేశారు. ఫిట్‌నెస్, నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని ప్రైవేటు బస్సు యాజమాన్యాలకు ఆర్టీఏ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
ఇవి కూడా చదవండి
ముంచుకొస్తున్న మొంథా.. మూడు రోజులు సెలవులు
కార్తీక మాసం మొదటి సోమవారం.. పిఠాపురం పాదగయ క్షేత్రానికి పోటెత్తిన భక్తజనం
Read latest AP News And Telugu News