Share News

PVN Madhav on GST: ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంగా ప్రధాని మోదీ కార్యక్రమాలు: పీవీఎన్ మాధవ్

ABN , Publish Date - Oct 03 , 2025 | 04:03 PM

ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ జీఎస్టీ గురించి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మండిపడ్డారు. జీఎస్టీ 2.0ని కాంగ్రెస్ రాష్ట్రాలు కూడా అంగీకరించిన విషయం రాహుల్ గాంధీకి తెలియదా? అని పీవీఎన్ మాధవ్ ప్రశ్నల వర్షం కురిపించారు.

PVN Madhav on GST: ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంగా ప్రధాని మోదీ కార్యక్రమాలు: పీవీఎన్ మాధవ్
PVN Madhav on GST

రాజమండ్రి, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ (PVN Madhav) వ్యాఖ్యానించారు. భారతదేశం అనేక విదేశీ సవాళ్లని ఎదుర్కొంటున్నా.. మోదీ ప్రభుత్వం జీఎస్టీని తగ్గించిందని ఉద్ఘాటించారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత రక్షణ రంగంలో విదేశాలకు ఎగుమతులు పెరిగాయని గుర్తుచేశారు పీవీఎన్ మాధవ్.


ఇవాళ (శుక్రవారం) రాజమండ్రి సుబ్రహ్మణ్యం మైదానంలో ఖాదీ సంతను పీవీఎన్ మాధవ్ సందర్శించారు. ఖాదీ వస్త్రాలు వినియోగిస్తామని పీవీఎన్ మాధవ్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీవీఎన్ మాధవ్ మీడియాతో మాట్లాడారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ జీఎస్టీ గురించి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జీఎస్టీ 2.0ని కాంగ్రెస్ రాష్ట్రాలు కూడా అంగీకరించిన విషయం రాహుల్ గాంధీకి తెలియదా? అని ప్రశ్నల వర్షం కురిపించారు పీవీఎన్ మాధవ్.


దేశ ఆర్థిక స్వావలంబన కోసం మరోసారి స్వదేశీ ఉద్యమం చేపట్టామని నొక్కిచెప్పారు. కూటమి ప్రభుత్వం సూపర్ సేవింగ్స్ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ప్రశంసించారు. తగ్గించిన జీఎస్టీని ఆరు సంవత్సరాల వరకు కేంద్రమే భరిస్తుందని తెలిపారు.పెట్రోల్‌పై జీఎస్టీని తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించట్లేదని చెప్పుకొచ్చారు. పెట్రోల్‌పై కేంద్రం విధిస్తున్న జీఎస్టీ 18 శాతమేనని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వాలు విధించే జీఏస్టీ దీనికి రెండు రెట్లు అదనంగా ఉంటోందని వెల్లడించారు. దేశవ్యాప్తంగా పెట్రోల్‌పైనా ఒకే రేటును తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోందని పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం.. 21 అంశాలపై చర్చ

అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 03 , 2025 | 05:06 PM