Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

BRS: ఎల్ఆర్ఎస్‌పై బీఆర్ఎస్ పోరుబాట.. 6, 7 తేదీల్లో..

ABN , Publish Date - Mar 04 , 2024 | 12:01 PM

Telangana: ఎల్ఆర్‌ఎస్‌పై(లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం) తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ పోరుబాటకు దిగింది. మార్చి 6న అన్ని నియోజకవర్గాల్లో, హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ కార్యాలయాల వద్ద రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు పిలుపునిచ్చింది. 7న జిల్లా కలెక్టర్, ఆర్డీవోలను కలిసి వినతి పత్రాలు సమర్పించాలని నిర్ణయించింది.

BRS: ఎల్ఆర్ఎస్‌పై  బీఆర్ఎస్ పోరుబాట.. 6, 7 తేదీల్లో..

హైదరాబాద్, మార్చి 4: ఎల్ఆర్‌ఎస్‌పై(లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం) (LRS) తెలంగాణ సర్కార్ (Telangana Government) తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ (BRS) పోరుబాటకు దిగింది. మార్చి 6న అన్ని నియోజకవర్గాల్లో, హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ కార్యాలయాల వద్ద రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు పిలుపునిచ్చింది. 7న జిల్లా కలెక్టర్, ఆర్డీవోలను కలిసి వినతి పత్రాలు సమర్పించాలని నిర్ణయించింది.

ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Leader KTR) మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలపై ఆర్థిక భారం మోపడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందన్నారు. తాము తెచ్చిన పథకాలకు ఆనాడు అడ్డు చెప్పి ఇప్పుడు అవే పనులు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందన్నారు. ఎల్ఆర్ఎస్‌పై కాంగ్రెస్ నేతలు (Congress Leaders) నాలుక మడతేశారని విమర్శించారు. తాము ఎల్ఆర్ఎస్ తెస్తే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy Venkatreddy) ఆనాడు కోర్ట్‌లో కేసు వేశారని గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామని భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) అన్నారని.. ఉచితంగా భూములు క్రమబద్దీకరిస్తామని ఉత్తమ్ (Minister Uttam Kumar) చెప్పారన్నారు. దోచుకోవడానికి ఎల్‌ఆర్‌ఎస్ తెచ్చారని సీతక్క (Minister Seethakka) కూడా అన్నారని తెలిపారు. ప్రజల నుంచి 20వేల కోట్లు భారం ప్రజలపై వేయడానికి ఎత్తుగడ వేశారని మండిపడ్డారు.

Sheep scheme: ఆ స్కామ్‌లో రాజకీయ నేత పాత్రమై ఏసీబీ వద్ద సమాచారం!


ఎల్ఆర్ఎస్‌పై వేసిన పిల్ ఏమైంది కోమటిరెడ్డి అని ప్రశ్నించారు. భట్టి, సీతక్క కూడా ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎల్ఆర్ఎస్‌పై ప్రభుత్వం వైఖరి మార్చుకోవాలని హితవుపలికారు. మార్చి31లోపు వసూలు చేయాలని టార్గెట్ పెట్టుకున్నారన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఎల్‌ఆర్‌ఎస్ ఉచితంగా చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా అధికారంలో ఉన్నప్పుడు ఒకలా ఉన్న కాంగ్రెస్ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌కు నిరసనగా 6న అన్ని నియోజక వర్గాల్లో, హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎంసడీ కార్యాలయాల వద్ద రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపడతామని. 7న జిల్లా కలెక్టర్, ఆర్డీవో లను కలిసి వినతి పత్రాలు ఇస్తామని, పార్టీ పక్షాన న్యాయ పోరాటం కూడా చేస్తామని కేటీఆర్ వెల్లడించారు.

Supreme Court: ఎంపీ, ఎమ్మెల్యేల లంచం కేసుల్లో సుప్రీంకోర్టు సంచలన తీర్పు


కాగా.. లేఅవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీం (ఎల్‌ఆర్‌ఎస్‌)పై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 2020 నుంచి పెండింగ్‌లో ఉన్న ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి మార్చి 31లోగా క్రమబద్ధీకరణ ప్రక్రియను ముగించాలని ఆయా శాఖలకు ఆదేశాలు జారీ చేసింది.

ఇవి కూడా చదవండి...

India vs Pakistan: త్వరలో ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్.. టిక్కెట్ ధర తెలిస్తే షాక్!

Shamshabad Airport: వామ్మో ఎంత బంగారమో...!


మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 04 , 2024 | 12:01 PM