Share News

Supreme Court: ఎంపీ, ఎమ్మెల్యేల లంచం కేసుల్లో సుప్రీంకోర్టు సంచలన తీర్పు

ABN , Publish Date - Mar 04 , 2024 | 11:09 AM

ఎంపీ, ఎమ్మెల్యేలకు లంచం కేసుల్లో సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. రాజ్యాంగ రక్షణ కల్పించలేమని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తేల్చి చెప్పింది. చట్టసభల్లో డబ్బులు తీసుకొని ఓటు వేసే ఎంపీ, ఎమ్మెల్యేలకు రాజ్యాంగ రక్షణ ఉండాలా ? లేదా అన్న దానిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పును వెలువరించింది.

Supreme Court: ఎంపీ, ఎమ్మెల్యేల లంచం కేసుల్లో  సుప్రీంకోర్టు సంచలన తీర్పు

ఢిల్లీ: ఎంపీ, ఎమ్మెల్యేల లంచం కేసుల్లో సుప్రీంకోర్టు (Supreme Court) సంచలన తీర్పును వెలువరించింది. చట్ట సభల్లో లంచం తీసుకుంటే రాజ్యాంగ రక్షణ కల్పించలేమని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తేల్చి చెప్పింది. ఏడుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవ తీర్పును వెలువరించింది. చట్టసభల్లో డబ్బులు తీసుకొని ఓటు వేసే ఎంపీ (MP), ఎమ్మెల్యే (MLA)లకు రాజ్యాంగ రక్షణ ఉండాలా ? లేదా అన్న దానిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ (DY Chandrachud) నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పును వెలువరించింది.

పీవీ నరసింహారావు (PV Narasimha Rao) కేసులో ఇమ్మ్యూనిటి కల్పిస్తూ ఇచ్చిన మెజారిటీ న్యాయవాదులు ఇచ్చిన తీర్పును సుప్రీం ధర్మాసనం కొట్టివేసింది. శాసనసభ్యులు, ఎంపీలు లంచం తీసుకోవడమనేది భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య పనితీరును నాశనం చేస్తోందని సీజేఐ డీవై చంద్రచూడ్ తెలిపారు. తీర్పు వెలువరించిన సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని న్యాయమూర్తులు ఏఎస్ బోపన్న (AS Bopanna), ఎంఎం సుందరేష్ (MM Sundaresh), పీఎస్ నరసింహ, జేబీ పార్దివాలా, సంజయ్ కుమార్, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరించింది.

ప్రజా ప్రతినిధి లంచం తీసుకోవడం నేరమని.. లంచం తీసుకిని శాసన సభ లేదా పార్లమెంట్‌లో మాట్లాడటం, ఓటు వేయడం నేరపూరిత చర్య అని సుప్రీంకోర్టు పేర్కొ్ంది. ఓటు లేదా ప్రసంగం కోసం లంచం తీసుకున్నారనే ఆరోపణలపై శాసనసభ్యుడికి మినహాయింపునిస్తూ పీవీ నరసింహాలోని తీర్పు విస్తృతమైన పరిణామాలను కలిగి ఉందని.. దీన్ని రద్దు చేస్తున్నామని సుప్రీం ధర్మాసనం వెల్లడించింది. శాసన విధులను నిర్వర్తించడానికి ఎమ్మెల్యేలు, ఎంపీలకు మినహాయింపులు అవసరం లేదని పేర్కొంది.

పీవీ నరసింహరావు కేసులో వెలువరించిన తీర్పు ఆర్టికల్ 105/194కు విరుద్ధమని సుప్రీంకోర్టు తెలిపింది. శాసన అధికారాల ఉద్దేశ్యం, లక్ష్యం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలని ధర్మాసనం పేర్కొంది. అధికారాలు సమిష్టిగా చట్టసకు ఉంటాయని స్పష్టం చేసింది. ఆర్టికల్ 105/194 సభ్యులకు నిర్భయ వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తోందని తెలిపింది. అవినీతి, శాసనసభ్యుల లంచం భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య పనితీరును నాశనం చేస్తోందని తెలిపింది. రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేయడానికి లంచం తీసుకుంటున్న ఎమ్మెల్యేలు అవినీతి నిరోధక చట్టం కింద కూడా బాధ్యులవుతారని సుప్రీంకోర్టు తెలిపింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 04 , 2024 | 12:41 PM