Share News

Supreme Court: బీసీ జాబితాపై సుప్రీంకోర్టులో విచారణ

ABN , Publish Date - Feb 27 , 2024 | 07:20 PM

తెలంగాణలో బీసీ జాబితా నుంచి 26 కులాల తొలగింపుపై సుప్రీంకోర్టు(Supreme Court) మంగళవారం నాడు విచారణ చేపట్టింది. బీసీ జాబితా నుంచి 26 కులాల తొలగింపుపై సుప్రీంలో పిటీషన్ దాఖలైంది. ఈ పిటీషన్‌ను న్యాయమూర్తులు సుధాంశు, బాలచంద్ర ప్రసన్నల ధర్మాసనం విచారణ చేపట్టింది.

Supreme Court: బీసీ జాబితాపై సుప్రీంకోర్టులో విచారణ

ఢిల్లీ: తెలంగాణలో బీసీ జాబితా నుంచి 26 కులాల తొలగింపుపై సుప్రీంకోర్టు(Supreme Court) మంగళవారం నాడు విచారణ చేపట్టింది. బీసీ జాబితా నుంచి 26 కులాల తొలగింపుపై సుప్రీంలో పిటీషన్ దాఖలైంది. ఈ పిటీషన్‌ను న్యాయమూర్తులు సుధాంశు, బాలచంద్ర ప్రసన్నల ధర్మాసనం విచారణ చేపట్టింది. కులగణన చేపడుతున్నామని సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ను రేవంత్ సర్కార్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కులగణన తర్వాత బిసీ జాబితాపై నిర్ణయం తీసుకుంటామని అఫిడవిట్‌లో తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. కులగణన తర్వాత నివేదిక సమర్పిస్తామని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. తదుపరి విచారణను ఏప్రిల్ 3వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 27 , 2024 | 07:20 PM