Home » HMDA
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రోజు రోజుకూ తగ్గుతున్నాయి. దీంతో చలి పంజా విసురుతోంది. ఇంకో నాలుగు రోజులపాటు ఈ పరిస్థితులు కొనసాగే అవకాశమున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది.
నగర శివారు ప్రాంతాల్లో లేఅవుట్ల అభివృద్ధిపైనే హైదరాబాద్ మహా నగర అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) ఫోకస్ పెట్టింది. గతంలో ఇతర సంస్థలకు చెందిన భూములను సైతం అభివృద్ధి చేసి హెచ్‌ఎండీఏ విక్రయించింది. ప్రస్తుతం ప్లాట్ల ఈ-వేలం నుంచి హెచ్‌ఎండీఏ పూర్తిగా తప్పుకున్నట్లుగా తెలుస్తోంది.
గ్రేటర్ హైదరాబాద్‌లో మరో ఆరు స్కైవాక్‌లు రానున్నాయి. వీటిని వివిధ ప్రాంతాల్లో ప్రాధాన్యతా క్రమంలో నిర్మాణం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా ప్రాంతాలు రద్దీగా ఉండడం, పాదచారులు రోడ్డు దాట్టేందుకు ఇబ్బందులు పడడం, ఈ క్రమంలో ప్రమాదాలు, ట్రాఫిక్‌జామ్ అవుతున్నట్లుగా గుర్తించారు.
హైదరాబాద్ మహా నగర అభివృద్ధి సంస్థ ప్లాట్లు వేలం వేస్తోందంటే జనం భారీగా పోటీ పడతారు. స్థలాలు నిమిషాల్లోనే అమ్ముడై.. సంస్థకు రూ.కోట్లు సమకూరతాయి. కానీ ఈసారి అలా జరగలేదు.
ఈకో గణేశ్, గ్రీన్ గణేశ్ కాన్సెప్ట్‌ను ప్రోత్సహిస్తూ.. నగరంలో పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు హెచ్ఎండీఏ చెప్పుకొచ్చింది. మట్టి వినాయక విగ్రహాల వాడకం ద్వారా ప్లాస్టిక్ వినియోగం తగ్గించి పర్యావరణ పరిరక్షణకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు పేర్కొన్నారు
హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) మరోసారి ప్లాట్లు, స్థలాల వేలానికి సిద్ధమైంది. సుమారు రెండేళ్ల విరామం తర్వాత ఆన్‌లైన్‌లో ఈ-వేలానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
భూ సమీకరణ పథకం (ల్యాండ్ పూలింగ్ స్కీమ్)కు మరిన్ని సంస్కరణలను జోడించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. విస్తరిత హెచ్‌ఎండీఏ పరిధిలో అమలు చేయనుంది.
Hyderabad 2050: ఐటీ, ఫార్మా రంగాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన హైదరాబాద్... మరో 50 ఏళ్లలో మరింత అభివృద్ధి చెందనుంది. హైదరాబాద్ రూపకల్పనలో కీలకంగా వ్యవహరిస్తున్న హెచ్‌ఎండీఏ 2050 కోసం దీర్ఘకాలిక ప్రణాళికలు రచ్చిస్తోంది.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో అభివృద్ధి చేసిన లేఅవుట్లలోని 2,570 ప్లాట్లను ఈ-వేలం ద్వారా విక్రయించేందుకు హెచ్‌ఎండీఏ( హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ) సన్నాహాలు చేస్తోంది.
హైదరాబాద్ నగరంలో మరో కొత్త తరహా సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. వాటర్ బోర్డు అధికారులమని, నల్లా బిల్లులంటూ మోసానికి తెరలేపారు. ఇప్పటికే నగరంలో ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట ఈ సైబరఫ మోసం జరుగుతూనే ఉంది.