TG Cold Wave Intensifies: తెలంగాణాపై చలి పంజా.. ఇంకో నాలుగు రోజులు వణకాల్సిందే.!
ABN , Publish Date - Dec 05 , 2025 | 08:15 AM
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రోజు రోజుకూ తగ్గుతున్నాయి. దీంతో చలి పంజా విసురుతోంది. ఇంకో నాలుగు రోజులపాటు ఈ పరిస్థితులు కొనసాగే అవకాశమున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది.
హైదరాబాద్, డిసెంబర్ 04: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతూ చలి తీవ్రత పెరుగుతోంది. దిత్వా తుఫాన్ ప్రభావమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. రానున్న నాలుగు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశమున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనం బలహీనపడటం వల్ల.. శుక్ర, శనివారాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అలాగే ఈ నెల 9న మరోసారి వర్ష సూచన కనిపిస్తోందని పేర్కొంది. దీంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రత స్థాయులు మరింత క్షీణించనున్నాయి.
దిత్వా తుఫాను తర్వాత రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పగటి వేళ ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుండగా, రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు 18 డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే తక్కువగా నమోదవుతున్నాయి. ఉదయం పూట విపరీతంగా మంచు కురుస్తోంది. ఇక రాష్ట్రంలో ఈశాన్య గాలులు చురుగ్గా వీస్తుండటంతో ఇప్పటికే ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోగా.. చలి విపరీతంగా పెరిగింది. శుక్రవారం నుంచి గాలిలో తేమ శాతం తగ్గడం వల్ల.. చలి గాలులు మరింత తీవ్రతరం కానున్నాయి. నాలుగు రోజుల పాటు ఇవే పరిస్థితులు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే అంచనా వేయడంతో.. ప్రజలు గజ గజ వణికే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఫలితంగా ప్రయాణాలు చేసేవారు అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పడు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అలాగే రైతులు కూడా సకాలంలో పనులు ముగించుకుని ఇంటికి చేరుకోవడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు.
ఇవీ చదవండి: