Distribution Of Clay Idols HMDA: నగరంలో ఉచితంగా మట్టి గణేష్ విగ్రహాల పంపిణీ..
ABN , Publish Date - Aug 22 , 2025 | 01:56 PM
ఈకో గణేశ్, గ్రీన్ గణేశ్ కాన్సెప్ట్‌ను ప్రోత్సహిస్తూ.. నగరంలో పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు హెచ్ఎండీఏ చెప్పుకొచ్చింది. మట్టి వినాయక విగ్రహాల వాడకం ద్వారా ప్లాస్టిక్ వినియోగం తగ్గించి పర్యావరణ పరిరక్షణకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు పేర్కొన్నారు
హైదరాబాద్: రానున్న వినాయక చవితికి నగరం కాలుష్యం బారిన పడకుండా.. హెచ్ఎండీఏ చర్యలు చేపట్టనుంది. ఈ మేరకు ఆదివారం(ఆగస్టు 24) నుంచి మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. నగర వ్యాప్తంగా 8 ఇంచుల ఎకో ఫ్రెండ్లీ విగ్రహాల పంపిణీ చేయనున్నట్లు తెలిపింది. నగర వ్యాప్తంగా 34 ప్రాంతాల్లో ఎకో ఫ్రెండ్లీ మట్టి వినాయకులను పంపిణీ చేయనున్నట్లు పేర్కొంది. 2017 నుంచి ఎకో ఫ్రెండ్లీ మట్టి గణేష్ విగ్రహాలను ఫ్రీగా పంపిణీ చేస్తున్నట్లు హెచ్ఎండీఏ వెల్లడించింది.
అంతేకాకుండా.. ఈకో గణేశ్, గ్రీన్ గణేశ్ కాన్సెప్ట్‌ను ప్రోత్సహిస్తూ.. నగరంలో పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు హెచ్ఎండీఏ చెప్పుకొచ్చింది. మట్టి వినాయక విగ్రహాల వాడకం ద్వారా ప్లాస్టిక్ వినియోగం తగ్గించి పర్యావరణ పరిరక్షణకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు పేర్కొంది. అయితే.. నగరంలో గత కొంత కాలంగా పీవోపీ వినాయకుల సంఖ్య పెరగటంతో కాలుష్యం కూడా పెరిగిపోయింది. ప్రభుత్వం మట్టి విగ్రహాలపై అవగాహన కల్పిస్తున్న కొందరి తీరు మాత్రం మారడం లేదు. పేరు కోసం.. పరుపతి కోసం పోటీ పడుతూ.. లక్షలు ఖర్చు పెట్టి పీవోపీ గణపతి విగ్రహాలు కొనుగోలు చేస్తూ.. కాలుష్యానికి కారణం అవుతున్నారు. అయితే ఈ మట్టి విగ్రహాలు కొనకపోవడానికి కూడా కారణాలు ఉన్నాయి. ఈ విగ్రహాలు పీవోపీ విగ్రహాల కంటే ఎక్కువ ధర ఉంటాయి. చూడటానికి కూడా అంత అట్రాక్షన్‌గా లేకపోవడంతో జనాలు ఎవరు మట్టి విగ్రహాలను కొనడం లేదు. బహుశా మట్టి విగ్రహాలు అందుబాటు ధరలో దొరికి.. దేవుడు ఎలా ఉన్న దేవుడే అన్న నిజాన్ని ప్రజలు గ్రహించిన నాడు మట్టి విగ్రహలకు డిమాండ్ పెరుగుతుంది కావచ్చు.
ఇవి కూడా చదవండి
పార్లమెంట్‌లోకి ఆగంతకుడు.. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది
గోదావరి - కావేరి అనుసంధానంపై కీలక భేటీ