Godavari - Cauvery: గోదావరి - కావేరి అనుసంధానంపై కీలక భేటీ
ABN , Publish Date - Aug 22 , 2025 | 09:06 AM
గోదావరి, కావేరి నదుల అనుసంధానంపై హైదరాబాద్‌లోని జలసౌధ వేదికగా శుక్రవారం కీలక భేటీ జరగనుంది. ఈ భేటీకి సెంట్రల్ వాటర కమిషన్ చైర్మన్ అధ్యక్షత వహించనున్నారు.
హైదరాబాద్, ఆగస్టు 22: నదులు అనుసంధానంపై వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. అందులో భాగంగా ఇచ్చంపల్లి రిజర్వాయర్ నుంచి గోదావరి - కావేరీ అనుసంధానం చేయడం సంప్రదింపుల కమిటీ సమావేశం కానుంది. ఆ క్రమంలో శుక్రవారం జల సౌధ కార్యాలయంలో సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన నేషనల్ ఇరిగేషన్ డెవలప్‌మెంట్ అథారిటీ సమావేశం కానుంది. ఈ సమావేశానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.
బొల్లాపల్లి నుంచి గోదావరి, కావేరి అనుసంధానం కోసం ఏపీ ప్రతిపాదనలు చేసిన సంగతి తెలిసిందే. అందుకు సంబంధించిన అనుమతుల కోసం కేంద్రంపై ఏపీ ప్రభుత్వం ఒత్తిడి చేస్తున్న సంగతి తెలిసిందే. అందుకు సంబంధించిన డీపీఆర్‌ను ఇప్పటికే కేంద్రానికి ప్రభుత్వం అందజేసింది. అయితే రాష్ట్ర నీటి వాటాలకు ఎటువంటి ఇబ్బందులు రాకూడదని తెలంగాణ ప్రభుత్వం కోరుతుంది. అలాంటి వేళ.. ఈ సమావేశం జరుగుతోంది.
మరోవైపు ఏపీ ప్రభుత్వం గోదావరి నదీ మిగులు జలాలను రాయలసీమకు వినియోగించుకొనేందుకు బనకచర్ల ప్రాజెక్ట్‌ను తెరపైకి తీసుకు వచ్చింది. ఈ ప్రాజెక్ట్‌పై తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతేకాకుండా.. ఈ ప్రాజెక్ట్ పై కేంద్రానికి సైతం తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. దీంతో ఢిల్లీ వేదికగా కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, భారీ నీటి పారుదల శాఖ మంత్రులతోపాటు ఉన్నతాధికారులు పాల్గొన్న సంగతి తెలిసిందే.
ఈ తరహా వివాదాలు రాష్ట్రాల మధ్య ఉండకూడదని కేంద్రం భావిస్తోంది. అందులోభాగంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ తరహా సమావేశాలు ఏర్పాటు చేయడం వల్ల రాష్ట్రాల మధ్య భవిష్యత్తులో ఏర్పాడే వివాదాలను ఆదిలోనే పరిష్కరించే విధంగా కేంద్రం ముందు చూపుతో వ్యవహరిస్తోంది.
ఇవి కూడా చదవండి
నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు..
ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా రికార్డు
Read Latest Telangana News and National News