ఏపీలో ఎండల ఎఫెక్ట్.. మూడు రోజుల పాటు వడగాలుల హెచ్చరిక
ABN , Publish Date - May 21 , 2026 | 03:42 PM
ఆంధ్రప్రదేశ్‌లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని విశాఖపట్నం తుపాను హెచ్చరికల కేంద్ర అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడగాలులు, కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.
విశాఖపట్నం, మే 21 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని విశాఖపట్నం తుపాను హెచ్చరికల కేంద్ర అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడగాలులు, కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్, మరికొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు వెల్లడించారు. ప్రజలు అత్యవసర పరిస్థితులు లేకపోతే మధ్యాహ్న సమయంలో బయటకు రావొద్దని సూచించారు. ముఖ్యంగా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ఈ సమయంలో నీడ పట్టున ఉండాలని, తగినంత నీరు తాగాలని సూచించారు.
ఏపీలో తేలికపాటి జల్లులు..
కోస్తా ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని జగన్నాథ్ కుమార్ తెలిపారు. ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో వాతావరణ మార్పుల ప్రభావంతో స్వల్ప వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. నైరుతీ రుతుపవనాలపై కూడా కీలక సమాచారం వెల్లడించారు. ప్రస్తుతం నైరుతీ రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, ఈ నెల 26వ తేదీన కేరళం తీరాన్ని తాకే అవకాశం ఉందని తెలిపారు. అనంతరం అవి ఆంధ్రప్రదేశ్ వైపు ముందుకు సాగే అవకాశముందని పేర్కొన్నారు. రుతుపవనాల రాకతో ఏపీలో వాతావరణంలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని తెలిపారు. వడగాలుల నేపథ్యంలో చిన్నపిల్లలు, వృద్ధులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. బయటకు వెళ్లే వారు తలపై గుడ్డ లేదా టోపీ ధరించడం, తరచూ నీరు, మజ్జిగ, పండ్ల రసాలు తీసుకోవడం మంచిదని చెబుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
సాంకేతికతతో గ్లోబల్ ఎకానమీలో ఏపీ కీలకంగా ఉంది: సీఎం చంద్రబాబు
నిబంధనలు ఉల్లంఘించే పరిశ్రమలపై కఠిన చర్యలు తప్పవు: పవన్ కల్యాణ్
దేశానికే ఆదర్శంగా ఏపీ విద్యా వ్యవస్థ: మంత్రి లోకేశ్
దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తాం: మంత్రి కందుల దుర్గేశ్
Read Latest AP News And Telangana News And International News And Telugu News