Share News

ఎన్ని అడ్డంకులు సృష్టించినా కన్నెపల్లి చేరుకుంటాం.. రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ధ్వజం

ABN , Publish Date - Jul 05 , 2026 | 11:22 AM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష క్యూసెక్కుల నీరు వృథాగా సముద్రంలో కలుస్తుంటే సీఎం ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

ఎన్ని అడ్డంకులు సృష్టించినా కన్నెపల్లి చేరుకుంటాం.. రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ధ్వజం
KTR

వరంగల్, జులై 5 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై (CM Revanth Reddy) మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష క్యూసెక్కుల నీరు వృథాగా సముద్రంలో కలుస్తుంటే సీఎం ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. మేడిగడ్డ బ్యారేజీతో సంబంధం లేకుండానే కన్నెపల్లి పంపుహౌస్ నుంచి నీరు ఎత్తిపోసే అవకాశం ఉన్నా... ఉద్దేశపూర్వకంగా నీటిని ఎత్తిపోయడం లేదని ధ్వజమెత్తారు. ఎగువన డ్యాములన్నీ ఖాళీగా ఉన్నా నీటిని ఎందుకు ఎత్తిపోయడం లేదని నిలదీశారు. ఇదంతా రైతులకు చూపేట్టేందుకే కన్నెపల్లి పంపుహౌస్ వెళ్తున్నామని చెప్పుకొచ్చారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా కన్నెపల్లి చేరుకుంటామని స్పష్టం చేశారు.


లక్ష క్యూసెక్కుల నీళ్లను రైతన్నలకు చూపిస్తాం..

నీళ్లను ప్రజలకు చూపించడానికే కన్నెపల్లికి పోతుంటే జనగామలో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ ఆగ్రహించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంత భయమెందుకని ప్రశ్నించారు. నీళ్లు ఇస్తే అన్నదాతల కోసం యూరియా, వడ్లు కొనాలి బోనస్ ఇవ్వాలని అన్నారు. దమ్ము ఉంటే, చేతనైతే మంచి చేసి ప్రజల మనసును సీఎం గెలవాలని డిమాండ్ చేశారు. ఏది ఏమైనా కన్నెపల్లికి పోతామని.. లక్ష క్యూసెక్కుల నీళ్లను రైతన్నలకు చూపిస్తామని తెలిపారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వ దొంగతనం బయటపడతుందనే భయంతో తమను కన్నేపల్లి దగ్గరకు పోనీయకుండా ఆపుతున్నారని ధ్వజమెత్తారు. సీఎం సూచన మేరకే పోలీసులు తమను అడ్డుకుంటున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


కేటీఆర్ కాన్వాయ్‌ను అడ్డుకున్న పోలీసులు..

అంతకుముందు, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కన్నేపల్లి పంపు హౌస్‌ను పరిశీలించేందుకు కేటీఆర్ హైదరాబాద్ నుంచి భారీ కాన్వాయ్‌తో కన్నేపల్లికి బయల్దేరారు. ఆయనతో పాటు వరంగల్, కరీంనగర్, నల్లగొండ నాయకులు ఉన్నారు. కన్నేపల్లి పంపుహౌస్ సందర్శన నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. బీఆర్ఎస్ నేతల కన్నెపల్లి సందర్శనకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. పంప్ హౌస్ గేట్ల దగ్గరే కేటీఆర్‌ని అడ్డుకునే అవకాశం ఉంది.


కేటీఆర్ కాన్వాయ్‌లో నలభైకి పైగా వాహనాలు..

ఈ క్రమంలోనే పెంబర్తికి కేటీఆర్ కాన్వాయ్ చేరుకోగా.. కాన్వాయ్‌ను పోలీసులు నిలిపివేశారు. భారీగా పోలీసులు మోహరించారు. ఆయన కాన్వాయ్‌లో నలభైకి పైగా వాహనాలు ఉన్నాయని.. మూడు వాహనాలకే అనుమతి ఇస్తామని పోలీసులు తేల్చిచెప్పారు. దీంతో వాగ్వాదానికి దిగి పోలీసుల బారికేడ్లను గులాబీ పార్టీ నేతలు తోసేశారు. పోలీసులు ఆపినా ఆగకుండా ఆయన కాన్వాయ్ ముందుకు వెళ్తుండటంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు బీఆర్ఎస్ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో అక్కడ పరిస్థితులు ఉద్రిక్తతకు దారి తీశాయి.


ఈ వార్తలు కూడా చదవండి...

ప్రజల ప్రేమే నా బలం.. 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానంపై సీఎం రేవంత్‌రెడ్డి

వరంగల్ భద్రకాళీ ఆలయం వద్ద ఉద్రిక్తత.. బీజేపీ నేతలను అడ్డుకున్న పోలీసులు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Jul 05 , 2026 | 11:39 AM