కాళేశ్వరంలో కుట్ర జరిగితే అప్పుడెందుకు కేసు పెట్టలేదు: కడియం శ్రీహరి
ABN , Publish Date - Sep 02 , 2026 | 02:38 PM
బీఆర్ఎస్ నాయకులు అక్కసుతో, అహంకారంతో మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే కల్వకుంట్ల కుటుంబానికి మాత్రమే ఉపయోగపడిందని ఆరోపించారు.
జనగామ, సెప్టెంబర్ 2 (ఆంధ్రజ్యోతి): బీఆర్ఎస్ నాయకులు అక్కసుతో, అహంకారంతో మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే కల్వకుంట్ల కుటుంబానికి మాత్రమే ఉపయోగపడిందని ఆరోపించారు. ఈరోజు (బుధవారం) లింగాల గణపురంలో కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొని మాట్లాడారు. బీజేపీ నేతలు సర్వేల్లో, పోటీల్లో వెనుకబడుతున్నారని రెచ్చిపోయి ఏది పడితే అది మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ద్వారానే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలోని పదేళ్లు తెలంగాణ మీద పడి లక్షల కోట్లు దోచుకున్నారని.. స్వయంగా కేసీఆర్ కూతురు కవిత చెప్పిందని ప్రస్తావించారు.
కవిత లేవనెత్తిన అంశాలకు బీఆర్ఎస్ సమాధానం చెప్పాలి..
దోచుకున్న సొత్తును లెక్కపెట్టేందుకు వారికి సమయం సరిపోవడం లేదని కవిత చెప్పారని కడియం శ్రీహరి అన్నారు. ఎక్కడో పంపకాల్లో తేడా రావడంతో ఇప్పుడు ఆమె బయటకు వచ్చి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నాయకులకు సిగ్గు ఉంటే తమ మీద విమర్శలు, వ్యతిరేకంగా నిరసనలు చేయడం కాదని.. కవిత లేవనెత్తిన అంశాలకు సమాధానం చెప్పాలని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరంలోని ప్రధాన మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు అప్పుడే కుంగిపోయాయని చెప్పుకొచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో కుట్ర జరిగిందనే అనుమానం ఉంటే అప్పుడెందుకు కేసు పెట్టలేదని ప్రశ్నించారు.
ప్రభుత్వ సొమ్మును కేసీఆర్ దుర్వినియోగం చేశారు..
కాళేశ్వరం నుంచి చుక్క నీటిని ఉపయోగించకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లలో అత్యధిక పంట దిగుబడి సాధించిందని కడియం శ్రీహరి తెలిపారు. కేసీఆర్ అధికారాన్ని అడ్డం పెట్టుకొని విచ్చలవిడిగా ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేశారని ధ్వజమెత్తారు. పదేళ్లలో కల్వకుంట్ల కుటుంబం మాత్రమే బంగారు కుటుంబం అయ్యిందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ హయాంలో ఎక్కడా కూడా తెలంగాణ ప్రజలు బాగుపడలేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చిందో బీజేపీ నాయకులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ సమాధానం చెప్పాలని కడియం శ్రీహరి ప్రశ్నించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హైదరాబాద్‌ను గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం: సీఎం రేవంత్‌రెడ్డి
రాహుల్ గాంధీపై ఆ కేసు నమోదు.. కేంద్రంపై మంత్రి జూపల్లి ధ్వజం
హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హై కోర్టులో ఊరట
Read Latest Telangana News And AP News And National News
And Telugu News