Share News

చిన్నారిపై లైంగిక దాడికి యత్నం.. కోర్టు సంచలన తీర్పు

ABN , Publish Date - Nov 16 , 2026 | 07:36 PM

చిన్నారిపై లైంగిక దాడికి యత్నించిన సెక్యూరిటీ గార్డుకు 20 ఏళ్ల జైలు శిక్షను రంగారెడ్డి జిల్లా ఫాస్ట్‌ట్రాక్ కోర్టు విధించింది. నిందితుడు రనోజ్ తాయేకు న్యాయస్థానం కఠిన కారాగార శిక్ష విధించింది. కోకాపేటలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఈ ఘటన జరిగింది.

చిన్నారిపై లైంగిక దాడికి యత్నం.. కోర్టు సంచలన తీర్పు
Kokapet Child Case

రంగారెడ్డి జిల్లా, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): చిన్నారిపై లైంగిక దాడికి యత్నించిన సెక్యూరిటీ గార్డుకు 20 ఏళ్ల జైలు శిక్షను రంగారెడ్డి జిల్లా ఫాస్ట్‌ట్రాక్ కోర్టు విధించింది. నిందితుడు రనోజ్ తాయేకు న్యాయస్థానం కఠిన కారాగార శిక్ష విధించింది. కోకాపేటలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఈ ఘటన జరిగింది. 2024లో తప్పిపోయిన పెంపుడు చిలుకను వెతుకుతున్న 9 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి నిందితుడు పాల్పడిన విషయం తెలిసిందే.


చిలుకను చూపిస్తానంటూ బాలికను ఆ అపార్ట్‌మెంట్‌లోని ఐదో అంతస్తులోకి తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించాడు. బాలిక ఫిర్యాదుతో నిందితుడు రనోజ్ తాయేపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో అతడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.2 వేల జరిమానాను కోర్టు విధించింది. బాధిత బాలికకు రూ.3 లక్షల పరిహారం చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

కాళేశ్వరం ప్రాజెక్టులో గేట్లు మూసి నీటిని నిల్వ చేసే అవకాశం లేదు: మంత్రి తుమ్మల

సజ్జనార్ ఆస్తుల కొనుగోళ్లపై విచారణ జరిపించాలి: రాజాసింగ్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 16 , 2026 | 08:13 PM