కాళేశ్వరం కూలినా ఎస్సారెస్పీ ద్వారా నీళ్లందించాం: మంత్రి ఉత్తమ్
ABN , Publish Date - Nov 06 , 2026 | 06:49 PM
కాళేశ్వరం కూలినా ఎస్సారెస్పీ ద్వారా తాము నీళ్లు అందించామని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాళేశ్వరం కేసీఆర్ హయాంలోనే కూలిందని చెప్పుకొచ్చారు.
సూర్యాపేట జిల్లా, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం కూలినా ఎస్సారెస్పీ ద్వారా తాము నీళ్లు అందించామని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Telangana Minister Uttam Kumar Reddy) వ్యాఖ్యానించారు. కాళేశ్వరం కేసీఆర్ హయాంలోనే కూలిందని చెప్పుకొచ్చారు. ఎల్‌నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటామని పేర్కొన్నారు. మన మధ్య చిల్లర పంచాయతీలు వద్దని.. అందరం సమానమేనని తెలిపారు. నాయకులు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ఈరోజు (శుక్రవారం) సూర్యాపేట జిల్లాలో మంత్రి ఉత్తమ్ పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
తెలంగాణలో మళ్లీ రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే..
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సర్వోత్తమ్ రెడ్డి భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. ఎవరెన్ని ప్రేలాపనలు చేసినా తెలంగాణలో మళ్లీ రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని జోస్యం చెప్పారు. 2024 నుంచి 2034 వరకు కాంగ్రెస్ ప్రభంజనమే వస్తుందని తెలిపారు. స్వతంత్ర భారతంలో తెలంగాణలో ఈ స్థాయి అభివృద్ధి తక్కువ రాష్ట్రాల్లో మాత్రమే జరుగుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గ్లోబల్ సమ్మిట్‌కు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ పథకాల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్
తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రమంత్రి ప్రశంసలు.. మంత్రి సీతక్కకు శివరాజ్ సింగ్ చౌహాన్ లేఖ
Read Latest Telangana News And AP News And National News
And Telugu News