గ్లోబల్ సమ్మిట్‌కు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి
ABN , Publish Date - Nov 05 , 2026 | 06:28 PM
గ్లోబల్ సమ్మిట్‌కు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గ్లోబల్ సమ్మిట్‌కు హాజరయ్యే ప్రతి ప్రతినిధికి ఒక లైజనింగ్ అధికారిని నియమించాలని దిశానిర్దేశం చేశారు.
హైదరాబాద్, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): గ్లోబల్ సమ్మిట్‌కు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) అధికారులను ఆదేశించారు. గ్లోబల్ సమ్మిట్‌కు హాజరయ్యే ప్రతి ప్రతినిధికి ఒక లైజనింగ్ అధికారిని నియమించాలని దిశానిర్దేశం చేశారు. ఈరోజు (గురువారం) తెలంగాణ కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై మంత్రుల, అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి చర్చించారు. గ్లోబల్ సమ్మిట్‌కు వచ్చే అతిథులు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న వెంటనే ప్రతినిధుల రిజిస్ట్రేషన్, పాసుల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు.
టూరిజానికి మరింత సమ ప్రాధాన్యం ఇవ్వాలి..
గ్లోబల్ సమ్మిట్‌కు ముందే పూర్తి సమాచారాన్ని ప్రతినిధులకు అందజేయాలని సీఎం సూచించారు. ప్రతి విభాగానికి ప్రత్యేక అధికారి, సెక్యూరిటీ అధికారిని నియమించాలని మార్గనిర్దేశం చేశారు. టూరిజానికి మరింత సమ ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. తెలంగాణలో ఉన్న ప్రముఖ టూరిస్ట్ స్పాట్‌లను గ్లోబల్ సమ్మిట్‌లో ప్రదర్శించాలని నిర్దేశించారు. వాతావరణ మార్పులపైన గ్లోబల్ సమ్మిట్‌లో ప్రత్యేకంగా చర్చించేలా చూడాలని దిశానిర్దేశం చేశారు.
ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి..
నర్సరీ నుంచి ఆక్స్‌ఫర్డ్ వరకు తెలంగాణ ఎడ్యుకేషన్‌ను ప్రతిబింబించేలా గ్లోబల్ సమ్మిట్‌లో చర్చించాలని ముఖ్యమంత్రి సూచించారు. నవంబరు 15వ తేదీ వరకు సమ్మిట్ ఏర్పాట్లపై ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని తెలిపారు. గ్లోబల్ సమ్మిట్‌కి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించాలని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
విద్యార్థుల యూనిఫాంలపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం
తెలంగాణను గ్లోబల్ టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం: భట్టి విక్రమార్క
భూ సర్వేలో అవకతవకలకు తావులేకుండా చర్యలు: మంత్రి పొంగులేటి
Read Latest AP News And Telangana News And National News
And Telugu News