తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ రెండు పథకాల ప్రారంభానికి ముహుర్తం ఫిక్స్
ABN , Publish Date - Nov 05 , 2026 | 09:32 PM
నవంబరు19వ తేదీన సిద్దిపేటలో ఇందిరమ్మ జీవిత భీమా, ఇందిరమ్మ చీరల పంపిణీ పథకాలను ప్రారంభిస్తామని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. సిద్దిపేట వేదికగా ఈ రెండు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టునున్నట్లు పేర్కొన్నారు.
హైదరాబాద్, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): నవంబరు19వ తేదీన సిద్దిపేటలో ఇందిరమ్మ జీవిత భీమా, ఇందిరమ్మ చీరల పంపిణీ పథకాలను ప్రారంభిస్తామని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Telangana Minister Ponguleti Srinivas Reddy) ప్రకటించారు. సిద్దిపేట వేదికగా ఈ రెండు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టునున్నట్లు పేర్కొన్నారు. రెవెన్యూ శాఖకు సంబంధించిన భూముల కేటాయింపుపై మంత్రి మండలి నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఈరోజు (గురువారం) తెలంగాణ కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి పొంగులేటి వివరించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఎన్‌డీఎస్‌ఏ అడిగిన అన్ని రకాల పరీక్షలను పూర్తిచేశామని స్పష్టం చేశారు. ప్రతి పరీక్షను విడివిడిగా నిర్వహించి నివేదికలను ఎన్‌డీఎస్‌ఏకు సమర్పించామని తెలిపారు. ఎన్‌డీఎస్‌ఏ సూచనలకు అనుగుణంగా తదుపరి చర్యలు చేపట్టేందుకు సిద్ధమయ్యామని పేర్కొన్నారు. నిపుణుల కమిటీ సూచనల మేరకు బ్యారేజీల పునరుద్ధరణ విధానాలను ఖరారు చేశామని వెల్లడించారు. బ్యారేజీలను ఏ విధంగా మరమ్మతు చేయాలనే అంశంపై స్పష్టమైన నివేదికలు వచ్చాయని చెప్పుకొచ్చారు. అప్‌స్ట్రీమ్‌లో గట్టు నిర్మాణాలు ఎలా చేపట్టాలనే దానిపై సూచనలు అందాయని అన్నారు.
డౌన్‌స్ట్రీమ్‌లో స్పిల్‌వే అప్రాన్ నిర్మాణంపై నిపుణులు నిర్దిష్ట సూచనలు చేశారని మంత్రి పొంగులేటి చెప్పారు. స్పిల్‌వే అప్రాన్ ఎంత వెడల్పు, ఎంత మందంతో నిర్మించాలనే అంశాలపై నివేదికలు సిద్ధమయ్యాయని తెలిపారు. సాంకేతిక ప్రమాణాలకు అనుగుణంగా బ్యారేజీల మరమ్మతులు చేపడతామని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును తిరిగి వినియోగంలోకి తీసుకురావడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఉద్ఘాటించారు. మూడు బ్యారేజీలను పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలని కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. బ్యారేజీల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
విద్యార్థుల యూనిఫాంలపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం
తెలంగాణను గ్లోబల్ టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం: భట్టి విక్రమార్క
భూ సర్వేలో అవకతవకలకు తావులేకుండా చర్యలు: మంత్రి పొంగులేటి
Read Latest AP News And Telangana News And National News
And Telugu News