తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రమంత్రి ప్రశంసలు.. మంత్రి సీతక్కకు శివరాజ్ సింగ్ చౌహాన్ లేఖ
ABN , Publish Date - Nov 05 , 2026 | 07:20 PM
వి.బి–జీ రామ్ జీ అమల్లో తెలంగాణ ప్రభుత్వ కృషిని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రశంసించారు. రాష్ట్రంలోని దాదాపు అన్ని గ్రామ పంచాయతీల్లో పనులు ప్రారంభించడంపై అభినందించారు.
ఢిల్లీ, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): వి.బి–జీ రామ్ జీ అమల్లో తెలంగాణ ప్రభుత్వ కృషిని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivraj Singh Chouhan) ప్రశంసించారు. రాష్ట్రంలోని దాదాపు అన్ని గ్రామ పంచాయతీల్లో పనులు ప్రారంభించడంపై అభినందించారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కకు (Seethakka) కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు (గురువారం) లేఖ రాశారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణకు రూ.3,825.3 కోట్ల నిధులను కేటాయించినట్లు వెల్లడించారు.
రాష్ట్రంలో 1.83 కోట్ల పనిదినాలను కల్పించాం..
తెలంగాణ ప్రతిపాదించిన గృహ నిర్మాణ పథకంతో పాటు పలు పనులకు అనుమతి ఇచ్చినట్లు శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. వి.బి–జీ రామ్ జీ కింద ఇప్పటివరకు రాష్ట్రంలో 1.83 కోట్ల పనిదినాలను కల్పించినట్లు ప్రస్తావించారు. కేంద్రమంత్రి లేఖలో తెలంగాణ ప్రభుత్వ కృషిపై ప్రశంసలు కురిపించారు. గ్రామీణ కుటుంబాలకు ఉపాధి కల్పన, చట్ట నిబంధనల అమల్లో రాష్ట్ర ప్రభుత్వ నిబద్ధతను కొనియాడారు. రాష్ట్రంలో పలు పనులను అమలు చేయడం, ప్రారంభించడంపై కేంద్రమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు.
అదనపు పనుల ప్రతిపాదనలకు ఆమోదం..
రాష్ట్ర ప్రభుత్వం సూచించిన అదనపు పనుల ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. వి.బి–జీ రామ్ జీ కింద అనుమతించిన పనుల జాబితా 375కు విస్తరిస్తామని తెలిపారు. తెలంగాణ ప్రతిపాదించిన రాష్ట్ర గృహ నిర్మాణ పథకానికి కూడా అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు. గ్రామీణ ఉపాధి కల్పనలో తెలంగాణ సాధించిన పురోగతిని గుర్తించామని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
విద్యార్థుల యూనిఫాంలపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం
తెలంగాణను గ్లోబల్ టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం: భట్టి విక్రమార్క
భూ సర్వేలో అవకతవకలకు తావులేకుండా చర్యలు: మంత్రి పొంగులేటి
Read Latest AP News And Telangana News And National News
And Telugu News