చౌటుప్పల్‌లో జోగిని దారుణ హత్య
ABN , Publish Date - Nov 02 , 2026 | 04:08 AM
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో ఓ జోగిని హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు జోగినిని చంపి.. అతని వద్ద ఉన్న 130 తులాల బంగారు ఆభరణాలు, రెండున్నర కిలోల వెండి, రూ.10లక్షల నగదును దోచుకెళ్లారు.
30 తులాల బంగారం, రెండున్నర కిలోలు వెండి, రూ.10లక్షల నగదు అపహరణ
అసోంకు చెందిన శిష్యుల పనేనని కుటుంబసభ్యుల ఫిర్యాదు
పోలీసుల అదుపులో నిందితులు!
చౌటుప్పల్ రూరల్, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో ఓ జోగిని హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు జోగినిని చంపి.. అతని వద్ద ఉన్న 130 తులాల బంగారు ఆభరణాలు, రెండున్నర కిలోల వెండి, రూ.10లక్షల నగదును దోచుకెళ్లారు. ఆ జోగిని వద్ద శిష్యరికం చేస్తోన్న అసోంకి చెంది న వ్యక్తులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని జోగిని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. సంస్థాన్‌నారాయణపురం మండలం పుట్టపాకకు చెందిన రాళ్లబండ సుధాకర్(50) జోగిని గా, పండుగల పూజారిగా పనిచేస్తూ చౌటుప్పల్‌లో నివాసం ఉంటున్నారు. సుధాకర్ అవివాహితుడు కాగా.. సమీప బంధువుల ఇద్దరు పిల్లలను దత్తత తీసుకున్నారు. దేవుడి పండుగలు చేస్తుండటంతో సుధాకర్ ఆర్థికంగా బాగానే సంపాదించారు. సుధాకర్ ప్రతీ ఏటా అసోం లోని గువాహటిలో కామాక్య శక్తిపీఠానికి వెళ్లివస్తుంటారు.
ఈ క్రమంలో అసోంకు చెందిన పవన్, హర్ష అనే ఇద్దరు సుధాకర్ వద్ద శిష్యులుగా చేరారు. మూడు రోజులుగా వారు సుధాకర్ ఇంట్లోనే ఉన్నారు. శనివారం అర్ధరాత్రి వారు సుధాకర్ కాళ్లు, చేతులు కట్టేసి పెప్పర్‌స్ర్పే చల్లి గొంతునులిమి చంపేశారు. ఇంట్లో ఉన్న 130 తులాల బంగారం, రెండున్నర కిలోల వెండి, రూ.10లక్షల నగదు (మొత్తం రూ.3 కోట్లు) తీసుకొని సుధాకర్ కారులోనే పరారయ్యారు. పక్కింట్లో ఉన్న సుధాకర్ కుమారుడు సురేష్.. ఇంట్లోకి వెళ్లి చూడ గా సుధాకర్ విగతజీవిగా కనిపించారు. సురేష్ ఫిర్యాదు మేరకు.. అసోంకు చెందిన యువకుల సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా సురేష్ కారు పెద్దఅంబర్‌పేట్ ఓఆర్‌ఆర్ టోల్‌గేట్ దాటినట్టు గుర్తించామని చౌటుప్పల్ సీఐ సతీశ్‌రెడ్డి తెలిపారు. అసోంకు వెళ్లే మార్గంలో నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి..
మోదీ రావణుడు.. మేం వానరసైన్యం!
Read Latest Telangana News And AP News And National News
And Telugu News