సీఎంఆర్ బియ్యం పంపిణీలో నిర్లక్ష్యం
ABN , Publish Date - Nov 01 , 2026 | 04:23 AM
కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) బియ్యం పంపిణీ అంశంలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన అధికారులపై సర్కారు కొరడా ఝుళిపిస్తోంది.
నిజామాబాద్ డీఎసవోపై వేటు, అరెస్టు
మానుకోట జిల్లా నర్సింహుల పేట రైస్ మిల్లుపై కేసు
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) బియ్యం పంపిణీ అంశంలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన అధికారులపై సర్కారు కొరడా ఝుళిపిస్తోంది. కొందరు రైస్ మిల్లర్లు నిబంధనలకు వ్యతిరేకంగా ఎఫ్‌సీఐకి సన్న బియ్యానికి బదులు దొడ్డు బియ్యం పంపిణీ, సీఎంఆర్ బకాయిల చెల్లింపు, రైస్ మిల్లుల తనిఖీ వ్యవహారంలో పర్యవేక్షణా లోపం ఉన్నట్లు తేలడంతో నిజామాబాద్ జిల్లా పౌరసరఫరాల అధికారి (డీఎ్‌సవో) శ్రీకాంత్ రెడ్డిని శనివారం రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆయన్ను అరెస్టు చేసిన సీఐడీ అధికారులు రిమాండ్‌పై కోర్టులో హాజరు పరిచారు. మరోవైపు, మహబూబాబాద్ జిల్లా నర్సింహుల పేట మండలంలోని పెద్ద నాగారం వద్ద గల శ్రీశ్రీ ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లులో పౌర సరఫరాల శాఖ విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అకస్మిక తనిఖీలు చేశారు. ప్రభుత్వానికి 250 మెట్రిక్ టన్నుల బియ్యం సకాలంలో సరఫరా చేయనందుకు ఈ రైస్ మిల్లుపై దాడి చేశారు. రైస్ మిల్లులో బియ్యం నిల్వలు, ఒప్పంద ప్రకారం సర్కారుకు పంపిణీ చేయాల్సిన బియ్యం విషయమై సోదాలు జరిపారు.
రూ.1.50 లక్షల విలువ గల 250 మెట్రిక్ టన్నుల ధాన్యంపై సరైన లెక్కలు చూపక పోవడంతో తహసీల్దార్ పీ కామేశ్వరరావు ఫిర్యాదు మేరకు నర్సింహులపేట పోలీస్ స్టేషన్‌లో రైస్ మిల్లులోని ఆరుగురు బాధ్యులపై కేసు నమోదు చేశారు. మరోవైపు, బియ్యం ధరల నియంత్రణతోపాటు సాధారణ ధరకు వినియోగదారులకు నాణ్యమైన బియ్యం విక్రయంలో పారదర్శకత కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు పౌర సరఫరాలశాఖ అధికారులు, రైస్ మిల్లర్లు, హోల్‌సేల్ బియ్యం వ్యాపారులతో జరిగిన సమావేశంలో 26 కిలోల బ్యాగ్ ప్యాక్‌లలో రకాల వారీగా బియ్యం గరిష్ఠ ధరలను ఖరారు చేసింది. బీపీటీ-కెఎన్‌ఎం రకం కిలో బియ్యం రూ.66, ఆర్‌ఎన్‌ఆర్/ తెలంగాణ సోనా కిలో రూ.74, హెచ్‌ఎంటీ/జెఎ్‌సఆర్ కిలో రూ.79గా నిర్ణయించారు. ఈ ధరలతో కూడిన బ్యానర్లను హైదరాబాద్‌లోని అన్ని బియ్యం విక్రయ కేంద్రాల్లో ప్రదర్శిస్తారు. ఇక, కూకట్ పల్లి సర్కిల్ పరిధిలోని పలు బియ్యం దుకాణాలపై మేడ్చల్ జిల్లా పౌర సరఫరాలశాఖ అధికారులు దాడులు చేశారు. నిబంధనలను ఉల్లంఘించి ఎమ్మార్పీకంటే ఎక్కువ ధరకు విక్రయిస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హైస్పీడ్ రైళ్ల మార్గాల పనులను వేగవంతం చేయండి.. కేంద్రానికి సీఎం రేవంత్ విన్నపం
ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడితే ఉపేక్షించం: మంత్రి పొంగులేటి
ఆదిలాబాద్‌కు ఏముఖం పెట్టుకుని వస్తారు.. కేటీఆర్‌పై కవిత ధ్వజం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News