3 రోజుల పాటు భారీ వర్షాలు
ABN , Publish Date - Nov 02 , 2026 | 03:33 AM
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాను ‘మురసు’ ప్రభావంతో రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
రాష్ట్రంపై మురసు తుఫాను ప్రభావం: వాతావరణ శాఖ
నేడు ఆరెంజ్.. రేపు రెడ్. ఎల్లుడి ఎల్లో అలర్ట్ జారీ
హైదరాబాద్, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాను ‘మురసు’ ప్రభావంతో రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సోమ, మంగళ, బుధవారాల్లో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో సోమవారం ఆరెంజ్, మంగళవారం రెడ్, బుధవారం ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
సోమవారం ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని పేర్కొంది. మంగళవారం ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రెడ్ అలర్ట్ ప్రకటించింది. భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హనుమకొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
మోదీ రావణుడు.. మేం వానరసైన్యం!
ఆదిలాబాద్‌కు ఏముఖం పెట్టుకుని వస్తారు.. కేటీఆర్‌పై కవిత ధ్వజం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News