దేశ ప్రజల భద్రత కోసమే.. ఇందిరాగాంధీ తూటాలకు బలయ్యారు
ABN , Publish Date - Nov 01 , 2026 | 04:20 AM
ఇందిర వర్ధంతి కార్యక్రమాన్ని సంగారెడ్డిలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ.. పేదలకు భూములు పంపిణీ చేసిన ఘనత ఇందిరమ్మకే దక్కుతుందని కొనియాడారు.
దేశంలో పేదవాళ్లకు భూములు పంచిన ఘనత ఇందిరదే
ఇందిరమ్మ ఇచ్చిన భూములే నేటికీ పేదలకు జీవనాధారం
ఓడీఎఫ్, బీడీఎల్, ఇక్రిశాట్ లాంటి గొప్ప సంస్థలను నెలకొల్పి సంగారెడ్డి జిల్లా అభివృద్ధికి బాటలు వేశారు
మెదక్ ఎంపీగా ప్రధానమంత్రి హోదాలో ఈ ప్రాంతానికి విశేష సేవలందించారు
ఇందిరాగాంధీ బాటలోనే రాహుల్, ప్రియాంక గాంధీ నడుస్తున్నారు
సంగారెడ్డిలో ఇందిరాగాంధీ
వర్ధంతి కార్యక్రమంలో జగ్గారెడ్డి
సంగారెడ్డి, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి): ఇందిర వర్ధంతి కార్యక్రమాన్ని సంగారెడ్డిలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ.. పేదలకు భూములు పంపిణీ చేసిన ఘనత ఇందిరమ్మకే దక్కుతుందని కొనియాడారు. నేటికీ అవే భూములు పేదలకు జీవనాధారంగా మారాయని తెలిపారు. మెదక్ ఎంపీగా ప్రాతినిథ్యం వహించి ఈ ప్రాంతానికి విశేష సేవలందించారని.. ప్రధాని హోదాలో జిల్లా పరిషత్ సమావేశంలోనూ పాల్గొన్నారని గుర్తుచేశారు. సంగారెడ్డితో ప్రత్యేక అనుబంధం ఉన్నందునే ఇక్కడ ఓడీఎఫ్, బీడీఎల్ పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేశారని ప్రస్తావించారు. దేశం కోసం త్యాగాలు చేసిన కుటుంబం నుంచి వచ్చిన రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీలు తన నానమ్మ ఇందిరాగాంధీ ఆశయాల బాటలో ప్రజల కోసం నడుస్తున్నారని జగ్గారెడ్డి అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హైస్పీడ్ రైళ్ల మార్గాల పనులను వేగవంతం చేయండి.. కేంద్రానికి సీఎం రేవంత్ విన్నపం
ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడితే ఉపేక్షించం: మంత్రి పొంగులేటి
ఆదిలాబాద్‌కు ఏముఖం పెట్టుకుని వస్తారు.. కేటీఆర్‌పై కవిత ధ్వజం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News