Home » Indira Gandhi
మహిళల ఆత్మగౌరవానికి కోటి చీరలు అందజేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విడతల వారీగా ఇందిరమ్మ చీరల పంపిణీ చేస్తామని తెలిపారు.
త్వరలో 14వేల అంగన్వాడీ టీచర్ల హెల్పర్ల నియామకాన్ని చేపట్టబోతున్నామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. మహిళా శిశు సంక్షేమాన్ని తమ ప్రభుత్వం ప్రాధాన్యతగా ఎంచుకుందని మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు.
మిలటరీపై కానీ, అధికారులపై కానీ తనకు ఎలాంటి అగౌరవం లేదని, అయితే స్వర్ణ దేవాలయం స్వాధీనం చేసుకోవడానికి ఎంచుకున్న మార్గం మాత్రం సరికాదన్నదే తన అభిప్రాయమని చిదంబరం తెలిపారు. స్వర్ణ దేవాలయం స్వాధీనానికి ఆర్మీని దూరంగా ఉంచాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రధాని నరేంద్ర మోదీ మరో ఘనతను సాధించారు. అత్యధిక కాలంపాటు పదవిలో కొనసాగిన రెండో ప్రధానిగా ఇందిరాగాంధీ..
అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో ఎమర్జెన్సీ (అత్యవసర పరిస్థితి) విధించి రాజ్యాంగ స్ఫూర్తిని ధ్వంసం చేసిందని ప్రధాని మోదీ ఆరోపించారు.
పాలన ఎలా ఉండకూడదో ఎమర్జెన్సీ ఓ కేస్ స్టడీ అయితే, పాలకులు ఎలా ఉండకూడదో జగన్ ఓ కేస్ స్టడీ అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. అమరావతిలో నిర్వహించిన సంవిధాన్ హత్యా దివాస్‌లో అనేక విషయాలపై బాబు ప్రసంగించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. 1975లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితిని విధించడాన్ని ఖండిస్తూ చేసిన తీర్మానాన్ని ఆమోదించింది.
ఇండియా అంటేనే ఇందిర. ప్రస్తుత యుద్ధ వాతావరణంలో పార్టీలకు అతీతంగా అందరూ ఆమెను జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఒక రకంగా.. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం కంటే 1971లో పాకిస్థాన్‌తో ఇందిరాగాంధీ చేసిన యుద్ధం గురించే ఇప్పుడు ఎక్కువగా చర్చ జరుగుతోంది అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి అన్నారు.
భారత ఉక్కు మహిళ.. అంటూ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ యుద్ధ సమయంలో దేశ సైనికాధికారులతో ఉన్న పాత ఫొటోను సీఎం రేవంత్ రెడ్డి ‘ఎక్స్’లో పోస్టు చేశారు.
నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో సోనియా, రాహుల్‌కు నోటీసులు జారీ చేయాలన్న ఈడీ విజ్ఞప్తిని ఢిల్లీ ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. ఛార్జిషీట్‌ను నేరుగా పరిగణనలోకి తీసుకోవడం అసాధ్యమని కోర్టు స్పష్టం చేసింది