Share News

స్టార్ట్‌పలతో సమస్యలు పరిష్కరించండి!

ABN , Publish Date - Nov 01 , 2026 | 04:12 AM

ఉచిత వ్యవసాయ విద్యుత్‌, వైద్యం, విద్యుత్తు, ఆహార భద్రత, భూపరిరక్షణ, రహదారులు, పాఠశాల విద్య, పంటల నమోదు వంటి ఏడు కీలక రంగాల్లో ఎదురవుతున్న సమస్యలకు సాంకేతిక పరిష్కారాలను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానిస్తోంది.

స్టార్ట్‌పలతో సమస్యలు పరిష్కరించండి!
Telangana Startup Challenge 2026

  • ఆవిష్కర్తలకు, పరిశోధకులకు రాష్ట్ర ప్రభుత్వం పిలుపు

  • ఎంపికైన వాటికి ‘ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌’లో ప్రదర్శనకు అవకాశం

హైదరాబాద్‌, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): ఉచిత వ్యవసాయ విద్యుత్‌, వైద్యం, విద్యుత్తు, ఆహార భద్రత, భూపరిరక్షణ, రహదారులు, పాఠశాల విద్య, పంటల నమోదు వంటి ఏడు కీలక రంగాల్లో ఎదురవుతున్న సమస్యలకు సాంకేతిక పరిష్కారాలను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. ఈ మేరకు ‘తెలంగాణ ఇన్నోవేషన్‌ స్టార్టప్‌ చాలెంజ్‌’ (టీఎ్‌సఐసీ-2026) పేరుతో వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంట్లో పాల్గొనదలచిన వారు నవంబరు 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణ మాత్రమే కాకుండా దేశంలోని ఇతర రాష్ట్రాలు, అంతర్జాతీయ స్థాయిలోని స్టార్టప్‌ సంస్థలు, వ్యక్తిగత ఆవిష్కర్తలు, విద్యార్థులు, పరిశోధకులు కూడా పాల్గొనే అవకాశం ఉంది. ఎంపికైన స్టార్ట్‌పలను డిసెంబరు 7, 8, 9వ తేదీల్లో నిర్వహించే ‘ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌-2026’లో ప్రదర్శిస్తారు. వాటి నుంచి ఆచరణాత్మకంగా ఉన్న వాటిని ఎంపిక చేసి ప్రభుత్వ శాఖల్లో అమలు చేయనున్నారు. ఏఐకామ్‌ (ఏఐకేఎఎం), టీ-హబ్‌, టీ-వర్క్స్‌, వీ-హబ్‌, టాస్క్‌, రిచ్‌ తదితర సంస్థలు ఈ ప్రాజెక్టులో భాగస్వాములుగా ఉండనున్నాయి.


పలు దశల తర్వాత ఎంపిక

దరఖాస్తుల స్వీకరణ తర్వాత.. సాంకేతిక సాధ్యాసాధ్యాలు, అమలు వ్యయం, విస్తృత స్థాయిలో వినియోగించే అవకాశం, ప్రజలకు కలిగే ప్రయోజనాల ఆధారంగా వాటిని పరిశీలిస్తారు. ఎంపికైన వారిని ఆయాశాఖల అధికారులతో కలిసి, తమ ప్రాజెక్టుల గురించి వివరించేందుకు పిలుస్తారు. ఈ వడపోత అనంతరం మిగిలిన వాటిని గ్లోబల్‌ సమ్మిట్‌లో ప్రదర్శిస్తారు. అక్కడ ఎంపికైన వాటిని క్షేత్రస్థాయిలో ప్రయోగాత్మకంగా అమలుచేసి ఫలితాలను అధ్యయనం చేస్తారు. విజయవంతమైన వాటిని ప్రభుత్వ శాఖల్లో విస్తృతంగా వినియోగించేందుకు అవకాశం ఉంది. ఈ విధంగా తుదిదశ వరకూ నిలిచిన ఆవిష్కర్తలకు.. ప్రభుత్వ శాఖలతో నేరుగా పనిచేసే అవకాశం కల్పిస్తారు. ప్రభుత్వ కొనుగోళ్లు, కాంట్రాక్టుల కోసం పోటీపడే అవకాశం కూడా వీరికి ఉంటుందని టీఐఎస్‌సీ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హైస్పీడ్ రైళ్ల మార్గాల ప‌నులను వేగ‌వంతం చేయండి.. కేంద్రానికి సీఎం రేవంత్ విన్నపం

ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడితే ఉపేక్షించం: మంత్రి పొంగులేటి

ఆదిలాబాద్‌కు ఏముఖం పెట్టుకుని వస్తారు.. కేటీఆర్‌పై కవిత ధ్వజం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 01 , 2026 | 04:12 AM