క్రాప్ హాలిడే ప్రకటించలేదు
ABN , Publish Date - Nov 01 , 2026 | 04:32 AM
రాష్ట్ర ప్రభుత్వం క్రాప్ హాలిడే ప్రకటించలేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వం క్రాప్ హాలిడేను ప్రకటించిందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారం అవాస్తవమని తెలిపారు.
ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాన్ని రైతులు నమ్మొద్దు:తుమ్మల
హైదరాబాద్, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం క్రాప్ హాలిడే ప్రకటించలేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వం క్రాప్ హాలిడేను ప్రకటించిందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారం అవాస్తవమని తెలిపారు. రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను ప్రతిపక్షాలు మానుకోవాలని హితవు పలికారు. రైతులకు ధైర్యం చెప్పాల్సిన సమయంలో తప్పుడు ప్రచారం చేస్తూ మరింత ఆందోళనకు గురిచేయడం సరికాదని, నాయకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.
ఎల్‌నినో ఒక్క తెలంగాణకే వచ్చింది కాదని, అది ప్రపంచ విపత్తు అని అన్నారు. రైతులు వారి ప్రాంత పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవాలన్నదే ప్రభుత్వ సూచన అని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం, నీటి లభ్యతలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నందున రైతుల ఆర్థికంగా నష్టపోకుండా ఆరుతడి, సమీకృత పంటల సాగును 6 నెలల నుంచి ప్రోత్సహిస్తున్నట్టు చెప్పారు. కరువు మండలాల్లో పంటనష్టంపై అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే మొదలుపెట్టారని వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హైస్పీడ్ రైళ్ల మార్గాల పనులను వేగవంతం చేయండి.. కేంద్రానికి సీఎం రేవంత్ విన్నపం
ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడితే ఉపేక్షించం: మంత్రి పొంగులేటి
ఆదిలాబాద్‌కు ఏముఖం పెట్టుకుని వస్తారు.. కేటీఆర్‌పై కవిత ధ్వజం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News