ఈ నెల నుంచే ట్రూ అప్ భారం
ABN , Publish Date - Nov 01 , 2026 | 03:59 AM
విద్యుత్ వినియోగదారుల నుంచి ఈ నెల నుంచే ట్రూ-అప్ (అంచనాలను మించి వాస్తవికంగా అయిన వ్యయం) చార్జీల వసూలుకు డిస్కమ్‌లు రంగం సిద్ధం చేశాయి.
నవంబరులో యూనిట్‌కు 30 పైసలు,
డిసెంబరు నుంచి 50పైసల దాకా వసూలు
రాష్ట్ర వ్యాప్తంగా పెరగనున్న కరెంట్ బిల్లులు
హైదరాబాద్, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): విద్యుత్ వినియోగదారుల నుంచి ఈ నెల నుంచే ట్రూ-అప్ (అంచనాలను మించి వాస్తవికంగా అయిన వ్యయం) చార్జీల వసూలుకు డిస్కమ్‌లు రంగం సిద్ధం చేశాయి. ట్రూ-అప్ రూపంలో రూ.7,635కోట్లను వసూలు చేసుకోవడానికి విద్యుత్ పంపిణీ సంస్థలకు తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్‌సీ) అనుమతినిచ్చిన విషయం విదితమే. నవంబరులో యూనిట్‌కు 30పైసలు, డిసెంబరు నుంచి యూనిట్‌కు 50పైసల చొప్పున వసూలు చేసుకోనున్నాయి. 29నెలల పాటు ఎస్పీడీసీఎల్, 26నెలల పాటు ఎన్పీడీసీఎల్ చార్జీలు వసూలు చేసుకునేందుకు ఈఆర్‌సీ వీలు కల్పించింది.
2022-23లో కరెంట్ కొనుగోళ్లకు రూ.5,186కోట్లు అదనంగా అయ్యాయని, ఇక 2023-24లో రెవెన్యూ ట్రూ-అప్ కింద రూ.2448కోట్ల వసూలుకు డిస్కమ్‌లు పిటిషన్లు వేయగా... ఈఆర్‌సీ ఆమోదం తెలిపింది. మొత్తం ట్రూ-అప్‌ను రూ.7,635 కోట్లకు ఆమోదించగా... ఇందులో రూ.2,214.99కోట్లను వ్యవసాయ వినియోగం ఖాతాలో చూపించారు. ఈ నిధులను ప్రభుత్వం నుంచి డిస్కమ్‌లు వసూలు చేసుకోనున్నాయి. మిగిలిన రూ.5420.23 కోట్లను డిస్కమ్‌లు వినియోగదారుల నుంచి వసూలు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో దక్షిణ డిస్కమ్ రూ.4222.93కోట్లు, ఉత్తర డిస్కమ్ రూ.1197.30కోట్లను ట్రూ-అప్ కింద వసూలు చేసుకోనున్నాయి. నవంబరు నుంచి ట్రూ-అప్ చార్జీలు బిల్లులో కనిపించనున్నాయి. ఈ బిల్లులను సాధారణ విద్యుత్ బిల్లులో కలపకుండా ప్రత్యేకంగా చూపించాలి. ఏ ఆర్థిక సంవత్సరానికి సంబంధించినది? ఎంత నెలవారీ వినియోగం లెక్కించారు? అనేది విద్యుత్ పంపిణీ సంస్థలు స్పష్టంగా పేర్కొనాల్సి ఉంటుంది.
యూనిట్లు అదనంగా పడే చార్జీలు
నవంబరులో డిసెంబరులో
100 రూ.30 రూ.50
200 రూ.60 రూ.100
300 రూ.90 రూ.150
ఈ వార్తలు కూడా చదవండి..
హైస్పీడ్ రైళ్ల మార్గాల పనులను వేగవంతం చేయండి.. కేంద్రానికి సీఎం రేవంత్ విన్నపం
ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడితే ఉపేక్షించం: మంత్రి పొంగులేటి
ఆదిలాబాద్‌కు ఏముఖం పెట్టుకుని వస్తారు.. కేటీఆర్‌పై కవిత ధ్వజం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News