తుమ్మిడిహెట్టిపై మహారాష్ట్ర .. అభ్యంతరాలను పరిష్కరిద్దాం
ABN , Publish Date - Nov 01 , 2026 | 04:40 AM
తుమ్మిడిహెట్టి బ్యారేజీపై మహారాష్ట్ర అభ్యంతరాలకు పరిష్కారం చూపిద్దామని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆ శాఖ అధికారులతో అన్నారు.
ముంపును తగ్గించేలా ప్రతిపాదనలు సిద్ధం చేయండి
ఇరిగేషన్ అధికారులకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశం
హైదరాబాద్, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): తుమ్మిడిహెట్టి బ్యారేజీపై మహారాష్ట్ర అభ్యంతరాలకు పరిష్కారం చూపిద్దామని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆ శాఖ అధికారులతో అన్నారు. నిర్దేశిత లక్ష్యం మేరకు నీటిని తరలించడానికి వీలుగా ముంపును సాధ్యమైనంత మేర తగ్గించేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని వారిని ఆదేశించారు. తుమ్మిడిహెట్టిపై మహారాష్ట్ర ముఖ్యమంత్రితో జరిగిన సమావేశానికి కొనసాగింపుగా శనివారం సాయంత్రం నీటిపారుదల శాఖ కార్యదర్శి ఇ.శ్రీధర్‌తో కలిసి మంత్రి ఉత్తమ్ సమీక్ష నిర్వహించారు.
150 మీటర్ల ఎత్తుతో, 151 మీటర్ల ఎత్తుతో, 152 మీటర్ల ఎత్తుతో ముంపునకు గురయ్యే నదీ గర్భం, అటవీ భూములు, ఎకో సెన్సివిటీ జోన్, కోర్ ప్రాంతాలు, రెవెన్యూ భూములు, ఆవాసాలను నివేదికలో స్పష్టంగా పేర్కొనాలని, మహారాష్ట్ర అభ్యంతరాలన్నీ పరిష్కరించి.. అనుమతి సాధించాలని అన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించి, 77 టీఎంసీలను తరలించి.. ఏడు జిల్లాల పరిధిలో 5.85 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యమన్నారు. ఈ సమావేశంలో ఈఎన్‌సీ(జనరల్) రమేశ్‌బాబుతోపాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హైస్పీడ్ రైళ్ల మార్గాల పనులను వేగవంతం చేయండి.. కేంద్రానికి సీఎం రేవంత్ విన్నపం
ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడితే ఉపేక్షించం: మంత్రి పొంగులేటి
ఆదిలాబాద్‌కు ఏముఖం పెట్టుకుని వస్తారు.. కేటీఆర్‌పై కవిత ధ్వజం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News