కేంద్ర కులగణనలో బీసీల లెక్క చెప్పాలి: మంత్రి పొన్నం ప్రభాకర్
ABN , Publish Date - Sep 26 , 2026 | 10:47 AM
బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి తమ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు.
సిద్దిపేట జిల్లా, సెప్టెంబర్ 26 (ఆంధ్రజ్యోతి): బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి తమ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) వ్యాఖ్యానించారు. ఈరోజు (శనివారం) సిద్దిపేట జిల్లాలోని వేములవాడ రోడ్డులో నిర్వహించిన చాకలి ఐలమ్మ 131వ జయంతిలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, కలెక్టర్ హైమావతి , సీపీ రష్మీ పెరుమాళ్ పాల్గొన్నారు. వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి మంత్రులు నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీల లెక్కలను కేంద్ర ప్రభుత్వం తీస్తోందని.. బీసీల లెక్కలను ఎందుకు చెప్పట్లేదని ప్రశ్నించారు. కేంద్రం చేస్తున్న కులగణనలో బీసీల లెక్క తేలాలని డిమాండ్ చేశారు. కోర్టు కేసుల నేపథ్యంలో రిజర్వేషన్లలో జాప్యం జరుగుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
చాకలి ఐలమ్మ గొప్ప వ్యక్తి: మంత్రి వాకిటి శ్రీహరి

చాకలి ఐలమ్మ గొప్ప వ్యక్తి అని మంత్రి వాకిటి శ్రీహరి కొనియాడారు. ఇసునూర్ దొరపై ఆమె పోరాటం చేశారని తెలిపారు. ఇంకా అక్కడక్కడా దొరల పాలన కనబడుతోందని మంత్రి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మహిళలను ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వైపు ప్రోత్సహించడమే మా ప్రభుత్వ లక్ష్యం: పెమ్మసాని
ధాన్యం సేకరణలో రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలి: మంత్రి నాదెండ్ల మనోహర్
పంట నష్టాల అంచనాలు తక్షణమే పూర్తి చేయాలి: మంత్రి అచ్చెన్నాయుడు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News