Share News

మంత్రి దామోదర బావమరిది సింగూర్ ప్రాజెక్టులో 200 ఎకరాలు భూ కబ్జా చేశారు: కవిత

ABN , Publish Date - Jun 07 , 2026 | 02:40 PM

జహీరాబాద్‌లో బుల్లెట్ ట్రైన్ కోసం భూ సేకరణ ప్రారంభించారని.. కానీ డీపీఆర్‌లో బుల్లెట్ ట్రైన్ ఎందుకు లేదని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. ఈ విషయంపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు, బీఆర్ఎస్ నాయకులు ఎందుకు మాట్లాడట్లేదని నిలదీశారు.

మంత్రి దామోదర బావమరిది సింగూర్ ప్రాజెక్టులో 200 ఎకరాలు భూ కబ్జా చేశారు: కవిత
Kalvakuntla Kavitha

సంగారెడ్డి, జూన్7 (ఆంధ్రజ్యోతి): జహీరాబాద్‌లో బుల్లెట్ ట్రైన్ కోసం భూ సేకరణ ప్రారంభించారని.. కానీ డీపీఆర్‌లో బుల్లెట్ ట్రైన్ ఎందుకు లేదని తెలంగాణ రక్షణ సేన(TRS) చీఫ్ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) ప్రశ్నించారు. ఈ విషయంపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు, బీఆర్ఎస్ నాయకులు ఎందుకు మాట్లాడట్లేదని నిలదీశారు. ఈరోజు(ఆదివారం) సంగారెడ్డిలో కవిత పర్యటించారు. జెండా పండగ కార్యక్రమంలో పాల్గొన్నారు. పోతిరెడ్డిపల్లి చౌరస్తా నుంచి తెలంగాణ తల్లి విగ్రహం వరకు ర్యాలీ తీశారు. తెలంగాణ తల్లి విగ్రహం వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడారు.


సింగూరు ప్రాజెక్టుని ఎందుకు రిపేర్ చేయలేదు..

హరీశ్‌రావు ఆనాడు ఇరిగేషన్ మంత్రిగా ఉండి సింగూరు ప్రాజెక్టు కుంగుతున్న ఒక్క రూపాయి కూడా ఎందుకు ఇవ్వలేదని కవిత ప్రశ్నించారు. నీళ్ల కోసం ఆనాడు ఆంధ్రా వాళ్లని తిట్టామని... మరి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఎందుకు రిపేర్ చేయలేదని నిలదీశారు. సింగూర్ ప్రాజెక్టు 2016-18లో మొత్తం ఎండిపోయిందని.. అయినా రిపేర్ ఎందుకు చేయలేదు..? అని ప్రశ్నించారు. మంత్రి దామోదర రాజనర్సింహ బావమరిది సింగూర్ ప్రాజెక్టులో 200 ఎకరాలను భూ కబ్జా చేస్తే బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఎందుకు ప్రశ్నించట్లేదని నిలదీశారు.


తెలంగాణలో అధికారంలోకి టీఆర్ఎస్..

రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని కవిత ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు ఉచిత విద్యుత్, వైద్యం ఇవ్వకపోతే తనను ప్రశ్నించాలని అన్నారు. సంగారెడ్డిలో రాజకీయం భలేగా ఉంటుందని చెప్పుకొచ్చారు. జగ్గారెడ్డి, రఘునందన్ రావు, దామోదర రాజనర్సింహ, హరీశ్‌రావు లాంటి నాయకులు వివిధ పార్టీల్లో ఉంటారని.. కానీ అందరూ కలిసి మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు చేస్తున్నారని కవిత విమర్శించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ఫాంహౌస్‌ కేడీతోనైనా, ఢిల్లీలో మోదీతోనైనా కొట్లాడేందుకు సిద్ధం: సీఎం రేవంత్‌‌రెడ్డి

ఆ పనుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు.. మంత్రి సీతక్క వార్నింగ్

Read Latest Telangana News And AP News  And National News

And Telugu News

Updated Date - Jun 07 , 2026 | 02:49 PM