ధాన్యం కొనుగోళ్లలో సమస్యలు పరిష్కరిస్తాం: మంత్రి ఉత్తమ్
ABN , Publish Date - May 14 , 2026 | 04:55 PM
రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంలో వరి రైతులు ఎవరూ అధైర్య పడవద్దని భరోసా కల్పించారు.
ఖమ్మం జిల్లా, మే 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) స్పష్టం చేశారు. ఈ విషయంలో వరి రైతులు ఎవరూ అధైర్య పడవద్దని భరోసా కల్పించారు. ఈరోజు(గురువారం) కూసుమంచి మండలం పాలేరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడారు.
ట్రాన్స్‌పోర్ట్, హమాలీల విషయంలో కొంత ఇబ్బంది ఉందని చెప్పుకొచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా తిరిగి ఆ సమస్యను ప్రభుత్వం పరిష్కారింస్తోందని పేర్కొన్నారు. యాసంగిలో 85 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని తమ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని వెల్లడించారు. బిహార్, పశ్చిమబెంగాల్ నుంచి ఎక్కువగా హమాలీలు తెలంగాణకు వస్తారని చెప్పుకొచ్చారు. ఇటీవలే పశ్చిమబెంగాల్‌లో ఎన్నికలు జరగడం వల్ల హమాలీల కొరత ఏర్పడిందని తెలిపారు. కేవలం ధాన్యం తరలించడానికి లారీలు, డీసీఎంలు ఏర్పాటు చేయాలని అన్నిజిల్లాల కలెక్టర్‌లకు మంత్రి ఉత్తమ్ ఆదేశాలు జారీచేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
టూరిజం, టెంపుల్ కారిడార్లపై సీఎం ప్రత్యేక ప్రణాళిక
సోషల్ మీడియాలో నిబంధనలు మీరితే కఠిన చర్యలు.. డీజీపీ వార్నింగ్
పోలీసులకు బండి భగీరథ్ లేఖ.. మే 15న విచారణకు హాజరవుతా
Read Latest Telangana News And AP News And International News And Telugu News