కేసీఆర్ హయాంలో ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్లు స్వాహా.. మంత్రి పొంగులేటి ధ్వజం
ABN , Publish Date - Oct 03 , 2026 | 07:54 PM
ఇందిరమ్మ రాజ్యంలో పేదలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని పేర్కొన్నారు.
ఖమ్మం జిల్లా, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ రాజ్యంలో పేదలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Telangana Minister Ponguleti Srinivasa Reddy) వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని పేర్కొన్నారు. అర్హులైన పేదలందరికి ఇళ్ల స్థలాలు, ఇళ్లను నిర్మిస్తామని మాటిచ్చారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం పాత పినపాక గ్రామంలో 79 మంది నిరుపేద లబ్ధిదారులకు ఇళ్లస్థలాల పట్టాలను మంత్రి ఈరోజు (శనివారం) పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ మట్టరాగమయి, జిల్లా కలెక్టర్. దివాకర, సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడారు.
కేసీఆర్ హయాంలో లక్షల కోట్లు స్వాహా..
కేసీఆర్ హయాంలో తెలంగాణను అప్పులమయంగా మార్చారని మంత్రి ధ్వజమెత్తారు. ప్రాజెక్టుల పేరుతో రూ.లక్షల కోట్లు స్వాహా చేశారని ఆగ్రహించారు. తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలో ఉన్న పేదల కోసం తాము సంక్షేమ పథకాలు అందిస్తున్నామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో పేదలకు సంక్షేమ పథకాలను అమలు చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలు, మధ్యతరగతి రైతులకు సంక్షేమ పథకాలు అందించామని వివరించారు. పేదలకు ఉచిత విద్యుత్తు, ఉచిత బస్సు, మహిళలకు వడ్డీ లేని రుణాలు, రైతులకు రైతు రుణమాఫీ, రైతు భరోసా, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రజా రవాణాను ఏకీకృతం చేసే దిశగా కీలక అడుగు వేశాం: సీఎం రేవంత్‌రెడ్డి
రేవంత్‌రెడ్డి, కేటీఆర్ ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి: రఘునందన్‌రావు
హైదరాబాద్ సిటీ పోలీస్ పరిధిలో భారీ పునర్వ్యవస్థీకరణ.. 76 ప్రాంతాల్లో మార్పులు\
Read Latest Telangana News And AP News And National News
And Telugu News