భూ వివాదాల పరిష్కారంలో తెలంగాణకు కొత్త దిశ సాకారం: మంత్రి పొంగులేటి
ABN , Publish Date - Apr 21 , 2026 | 07:05 PM
భూ వివాదాల పరిష్కారంలో తెలంగాణకు కొత్త దిశ సాకారమైందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఖమ్మం జిల్లాలోని కూసుమంచిలో సర్వే మ్యాప్‌తో తొలి రిజిస్ట్రేషన్ జరిగిందని పేర్కొన్నారు.
ఖమ్మం జిల్లా, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): భూ వివాదాల పరిష్కారంలో తెలంగాణకు కొత్త దిశ సాకారమైందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) వ్యాఖ్యానించారు. ఖమ్మం జిల్లాలోని కూసుమంచిలో సర్వే మ్యాప్‌తో తొలి రిజిస్ట్రేషన్ జరిగిందని పేర్కొన్నారు. భూభారతి పోర్టల్‌తో భూమి హక్కులకు శాశ్వత భరోసా కల్పించామని చెప్పుకొచ్చారు. ప్రతి భూమికి ప్రత్యేక భూధార్ నంబర్ కేటాయించామన్నారు. రిజిస్ట్రేషన్‌కు సర్వే మ్యాప్ తప్పనిసరి చేస్తూ కొత్త నిబంధన ఉంటుందని స్పష్టం చేశారు. ఈరోజు (మంగళవారం) ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. భూభారతి పోర్టల్ రైతులకు భద్రత, కుటుంబాలకు నమ్మకమని తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రెవెన్యూ సంస్కరణలు చేపట్టామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వివరించారు. ఐదు మండలాల్లో పైలట్‌గా భూభారతి అమలవుతోందని చెప్పుకొచ్చారు. ల్యాండ్, సర్వే, రిజిస్ట్రేషన్ విభాగాలు ఒకే ప్లాట్‌ఫామ్‌లోకి తీసుకొచ్చామని తెలిపారు. దేశానికి ఆదర్శంగా భూభారతి పోర్టల్ ఉంటుందని వ్యాఖ్యానించారు. కూసుమంచిలో చారిత్రాత్మకంగా తొలి నమోదు చేశామని వివరించారు. రైతు భూమి హక్కులకు ఓ స్పష్టత ఇచ్చామని.. సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పుకొచ్చారు. సర్వే మ్యాప్‌తో యాజమాన్యంపై ఎలాంటి సందేహం లేకుండా చర్యలు చేపట్టామని అన్నారు. ఆధునాతన టెక్నాలజీతో కచ్చితమైన భూసర్వేలు చేపడతామని.. దశలవారీగా రాష్ట్రమంతా అమలు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
రైతు భరోసా రెండో విడత నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్‌రెడ్డి
నాకు శాపాలు పెడతారా.. కాంగ్రెస్ సర్కార్‌పై కేసీఆర్ ధ్వజం
నటి అనసూయపై అసభ్యకర పోస్టులు.. నిందితుడి అరెస్ట్
Read Latest Telangana News And AP News And International News And Telugu News