Share News

నటి అనసూయపై అసభ్యకర పోస్టులు.. నిందితుడి అరెస్ట్

ABN , Publish Date - Apr 20 , 2026 | 03:32 PM

సోషల్ మీడియా వేదికగా మహిళా సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్న వారిపై పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఒక నిందితుడిని అరెస్ట్ చేశారు.

నటి అనసూయపై అసభ్యకర పోస్టులు.. నిందితుడి అరెస్ట్
Anasuya Bharadwaj

హైదరాబాద్, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): సోషల్ మీడియా వేదికగా మహిళా సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్న వారిపై పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఓ నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడు నల్గొండ జిల్లాకు చెందిన చంటిగా గుర్తించారు. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ (@chantidhorapally) ద్వారా అనసూయపై అత్యంత అసభ్యకరమైన వ్యాఖ్యలతో పోస్టులు పెట్టినట్లు అనసూయ తెలిపారు. తన వ్యక్తిత్వాన్ని హననం చేసేలా, గౌరవానికి భంగం కలిగించేలా పోస్టులు పెడుతున్నారని అనసూయ సైబర్ క్రైమ్ విభాగంలో ఫిర్యాదు చేశారు.


పోలీసుల చర్యలు..

అనసూయ ఫిర్యాదును స్వీకరించిన సైబరాబాద్ పోలీసులు సాంకేతిక ఆధారాల సాయంతో నిందితుడిని గుర్తించారు. నల్గొండలో ఉన్న చంటిని అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో సైబర్ క్రైమ్ పోలీసులు ప్రజలకు, నెటిజన్లకు పలు కీలక సూచనలు చేశారు. సోషల్ మీడియాలో ఎవరిపై అయినా అసభ్యకరమైన కంటెంట్, దూషణలు లేదా వ్యక్తిగత దాడులకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్ మీడియాను విజ్ఞానానికి, సమాచార మార్పిడికి వినియోగించాలే తప్ప, ఇతరులను కించపరచడానికి వాడకూడదని సూచించారు. మహిళలను వేధించే వారిపై ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. సెలబ్రిటీలు తరచుగా ఇలాంటి వేధింపులకు గురవుతున్న నేపథ్యంలో.. అనసూయ ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయడంపై సినీ ప్రముఖులు, నెటిజన్ల నుంచి మద్దతు లభిస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి...

గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ.. ఏం చర్చించారంటే..

కేసీఆర్ హయాంలో రూ.8 లక్షల కోట్ల అప్పులు చేశారు: మంత్రి వివేక్

33 శాతం మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలి: కిరణ్ కుమార్ రెడ్డి

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - Apr 20 , 2026 | 03:50 PM