వ్యవసాయ రంగంలో తెలంగాణ దూసుకెళ్తోంది: మంత్రి తుమ్మల
ABN , Publish Date - Jun 09 , 2026 | 09:23 PM
తెలంగాణలో కోటీ యాభై లక్షల టన్నుల ధాన్యం పండించారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు 75 లక్షల టన్నుల మెట్రిక్ ధాన్యం కొనుగోలు చేశామని పేర్కొన్నారు.
ఖమ్మం జిల్లా, జూన్ 9 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో కోటీ యాభై లక్షల టన్నుల ధాన్యం పండించారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Thummala Nageswara Rao) వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు 75 లక్షల టన్నుల మెట్రిక్ ధాన్యం కొనుగోలు చేశామని పేర్కొన్నారు. ఈరోజు (మంగళవారం) నేలకొండపల్లి మండలం చెరువు మాదారంలో డీసీసీబీ నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి తుమ్మల హాజరై మాట్లాడారు. అన్ని వ్యవసాయ పంటలు పండించే నియోజకవర్గం పాలేరు అని అభివర్ణించారు. నేడు పాలేరు ధనిక నియోజకవర్గమని ఉద్ఘాటించారు.
ఈ ఏడాదిలోనే పాలేరుకు గోదావరి జలాలు..
నాగార్జునసాగర్ జలాలతో పాటు, భక్తరామదాసు, గోదావరి జలాలతో నియోజకవర్గం పునీతమవుతోందని మంత్రి తుమ్మల వ్యాఖ్యానించారు. ఈ పనుల కోసం రూ.4,900 కోట్లు కేటాయించామని వెల్లడించారు. ఈ ఏడాదిలోనే పాలేరుకు గోదావరి జలాలు వస్తాయని వివరించారు. రైతులను బాధపెట్టే వారే రేవంత్‌రెడ్డిని విమర్శిస్తున్నారని అన్నారు. రూ.20 వేల కోట్ల రుణమాఫీ చేశామని స్పష్టం చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ ఎక్కడా రుణమాఫీ చేయలేదని.. అప్పులు చాలా ఉంటాయని అన్నారు. తమ ప్రభుత్వం పంటరుణాల వరకు రుణమాఫీ చేసిందని ప్రస్తావించారు. ఖజానాపై భారం ఉన్నప్పటికీ రూ.27 వేల కోట్లు రైతు భరోసా ఇచ్చామని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తప్పులు చేయదు..
పక్క రాష్ట్రంలో మొక్కజొన్న కొనటం లేదని మంత్రి తుమ్మల తెలిపారు. పక్క రాష్ట్రాల రైతులు ఇక్కడ రైతుల పేరు మీద అమ్ముకుంటున్నారని చెప్పుకొచ్చారు. పనిచేసిన ప్రభుత్వాన్ని ఆశీర్వాదిస్తే ప్రజల బతుకులు బాగుంటాయని తెలిపారు. డీజిల్, యూరియా ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమేనని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం తప్పులు చేయదన్నారు. రైతులు బీఆర్ఎస్, బీజేపీ పార్టీలను నమ్మే పరిస్థితి లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
గుజరాత్‌కు ఎన్నాళ్లు గులాంలుగా ఉంటారు?: సీఎం రేవంత్
ప్రతి నియోజకవర్గంలో అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేస్తాం: భట్టి విక్రమార్క
Read Latest Telangana News And AP News And National News
And Telugu News