ప్రతి నియోజకవర్గంలో అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేస్తాం: భట్టి విక్రమార్క
ABN , Publish Date - Jun 08 , 2026 | 02:51 PM
అంబేడ్కర్ భవన స్థలంలో అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. దీనికోసం రూ.110 కోట్లు బడ్జెట్‌లో కేటాయించి, మంజూరు చేశామని పేర్కొన్నారు. 12 అంతస్తులో అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్ నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు.
హైదరాబాద్, జూన్8 (ఆంధ్రజ్యోతి): అంబేడ్కర్ భవన స్థలంలో అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) వ్యాఖ్యానించారు. దీనికోసం రూ.110 కోట్లు బడ్జెట్‌లో కేటాయించి, మంజూరు చేశామని పేర్కొన్నారు. 12 అంతస్తులో అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్ నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. ఈరోజు (సోమవారం) లోయర్ ట్యాంక్ బండ్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భవన్‌ను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే ముఠాగోపాల్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా సందర్శించారు. ఈ సందర్భంగా మల్లు భట్టి విక్రమార్క మాట్లాడారు.
ఈ నాలెడ్జ్ సెంటర్ కోసం ప్రభుత్వం రూ. 110 కోట్లు నిధులు కేటాయించిందని.. అందులో ఈరోజు రూ.50 కోట్లు మంజూరు చేశామని మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఈ నాలెడ్జ్ సెంటర్ నిరుపేద విద్యార్థులకు శిక్షణ ఇస్తోందని చెప్పుకొచ్చారు. సెల్లార్, గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు పది అంతస్తుల వరకు ఈ భవన నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. ఈ నాలెడ్జ్ సెంటర్‌లో శిక్షణ తరగతులు, డిజిటల్ లైబ్రరీ, వివిధ దేశాల నుంచి వచ్చే ప్రతినిధులతో సెమినార్స్ నిర్వహించి విజ్ఞానాన్ని అందరికీ పంచుతామని వివరించారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో అంబేడ్కర్ నాలెడ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. లోయర్ ట్యాంక్ బండ్ అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్‌తో పాటు నింబోలి అడ్డలోని ఎస్సీ హాస్టల్ ఆధునికీకరిస్తున్నామని చెప్పారు. దానికి బాబూ జగ్జీవన్ రామ్ భవన్‌గా నామకరణం చేస్తున్నామని మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
RRR ఎందుకు ఆగుతోంది.. కిషన్‌రెడ్డి సమాధానం చెప్పాలి: సీఎం రేవంత్‌రెడ్డి
నువ్వు ఎంత రెచ్చగొట్టిన నేను తొందరపడను.. సీఎంకి కిషన్‌రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News