RRR ఎందుకు ఆగుతోంది.. కిషన్‌రెడ్డి సమాధానం చెప్పాలి: సీఎం రేవంత్‌రెడ్డి
ABN , Publish Date - Jun 07 , 2026 | 07:18 PM
మహిళల ఆశీర్వాదంతోనే ఈ స్థాయికి ఎదిగానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కొడంగల్‌లో ఓడినా తనను మల్కాజ్‌గిరి ఎంపీగా గెలిపించారని ప్రస్తావించారు.
హైదరాబాద్, జూన్7 (ఆంధ్రజ్యోతి): మహిళల ఆశీర్వాదంతోనే ఈ స్థాయికి ఎదిగానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) వ్యాఖ్యానించారు. కొడంగల్‌లో ఓడినా తనను మల్కాజ్‌గిరి ఎంపీగా గెలిపించారని ప్రస్తావించారు. మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గం అంటే మినీ భారత్ అని అభివర్ణించారు. ఈరోజు (ఆదివారం) ఉప్పల్ భగాయత్ లే అవుట్‌లో రూ.1511 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, ప్రభుత్వ సలహా దారు వి.హనుమంతరావు, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్, ఎమ్మెల్యేలు బండారి లక్ష్మారెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి, గణేశ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు.
హైదరాబాద్ ఇంటర్నేషనల్ సిటీగా మారుతుంది..
కేసీఆర్ హయాంలో సహకారం అందించకపోవడంతో మల్కాజ్‌గిరి ఎంపీగా.. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేకపోయానని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఇప్పుడు సీఎంగా మల్కాజ్‌గిరి అభివృద్ధిపై దృష్టిపెట్టానని చెప్పుకొచ్చారు. అంతర్జాతీయ స్థాయిలో మౌలిక వసతులు కల్పిస్తే.. హైదరాబాద్ ఇంటర్నేషనల్ సిటీగా మారుతుందని తెలిపారు. ORR లోపల రూ.1.30 కోట్ల జనాభా ఉందని చెప్పారు. పరిపాలనా సౌలభ్యం కోసమే మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఎన్నికల్లో లబ్ధి కోసమే మూడు మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
మూసీ మురికివల్లే ఉప్పల్ విలువ పడిపోయింది..
హైదరాబాద్‌లో పరిపాలనా వికేంద్రీకరణ జరగాలని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు.. ఇప్పుడు అభివృద్ధిపైనే దృష్టి పెడతామని స్పష్టం చేశారు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్‌కు బండారు రాజిరెడ్డి పేరు పెట్టామని ప్రస్తావించారు. పార్టీలు చూస్తే ఆ రకమైన నిర్ణయం తీసుకునేవాళ్లమా..? అని ప్రశ్నించారు. గుజరాత్‌లో సబర్మతి రివర్‌ఫ్రంట్ కట్టుకున్నారని చెప్పుకొచ్చారు. తాము మూసీ ప్రక్షాళన చేసుకుంటామంటే అడ్డుపడుతున్నారని ధ్వజమెత్తారు. మూసీ మురికివల్లే ఉప్పల్ విలువ పడిపోయిందని తెలిపారు. మూసీ కాలుష్యం నల్గొండ ప్రజలను కాటేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మూసీ ప్రక్షాళనకు అనుమతులు తీసుకొస్తారా..?, లేదా,,? అని నిలదీశారు.
మెట్రో విస్తరణ జరగాలా? వద్దా?..
భాగ్యనగరంలో మెట్రో విస్తరణ జరగాలా..? , వద్దా..? ఆలోచించుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. అన్ని అనుమతులు వచ్చాక ఇక్కడున్న కేంద్రమంత్రి ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. RRR ఎందుకు ఆగుతోంది.. కిషన్‌రెడ్డి సమాధానం చెప్పాలని నిలదీశారు. రాష్ట్రంలో పండించిన ధాన్యం మొత్తాన్ని కొనాల్సిన.. బాధ్యత కేంద్రానికి, కిషన్‌రెడ్డికి లేదా..? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ నెల 15వ తేదీ తర్వాత కేంద్రంపై తమ కార్యాచరణ ఉంటుందని తెలిపారు. మాజీ మంత్రి కేటీఆర్ చెప్పినట్లుగా కిషన్‌రెడ్డి వింటారని బీజేపీ నేతలే చెబుతుంటారని విమర్శించారు. ఒక్కరోజైనా తనను వెంటబెట్టుకుని కేంద్రమంత్రులను కలిశారా..? అని ప్రశ్నించారు. అనుమతులు ఇవ్వొద్దనే మహారాష్ట్ర సీఎం.. తనను కలవకుండా తప్పించుకుని తిరుగుతున్నారని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఫాంహౌస్ కేడీతోనైనా, ఢిల్లీలో మోదీతోనైనా కొట్లాడేందుకు సిద్ధం: సీఎం రేవంత్‌రెడ్డి
ఆ పనుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు.. మంత్రి సీతక్క వార్నింగ్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News