Home » Malkajgiri
కుల, మత రాజకీయాలు శాశ్వతంగా నడవవని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అభిప్రాయపడ్డారు. గెలిచినా, ఓడినా, అధికారంలో ఉన్నా, లేకపోయినా దశాబ్దాలుగా ప్రజల కోసం పనిచేస్తున్న పార్టీ బీజేపీ అని అభివర్ణించారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని అన్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలను బొంద పెట్టాలని ఎంపీ ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. దేశం సురక్షితంగానూ, సుభిక్షంగానూ ఉండాలంటే మోదీ ప్రధానిగా ఉండాలని ఆయన పేర్కొన్నారు.
ఓ యువతి కారులో ట్రాకింగ్ డివైస్ పెట్టి, ఆమె ఆడియోను మార్ఫింగ్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నాడు ఓ నిత్యపెళ్లి కొడుకు. జిమ్‌లో పరిచయమైన యువతిని బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు.
సికింద్రాబాద్ స్టేషన్‌లో పునరాభివృద్ధి పనులు కొనసాగుతున్నందున ఆయా ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లను బుధవారం నుంచి నవంబర్ 26 వరకు మల్కాజ్‌గిరి, హైదరాబాద్, చర్లపల్లి టెర్మినల్స్‌కు పొడిగిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
గుడి, బడి తేడా లేకుండా ఎక్కడపడితే అక్కడ విచ్చలవిచిగా గంజాయి, మద్యం విక్రయిస్తున్నారని, యువత పెడధోరణి పడుతున్నారని.. ప్రొహిబిషన్ కాదు ప్రమోషన్ శాఖగా ఎక్సైజ్ శాఖ మారిందని ఎక్సైజ్ శాఖ దిశ కమిటీ చైర్మన్, ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు. ఇప్పటికైనా ఎక్సైజ్ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.
నాగర్‌కర్నూల్, మేడ్చల్-మల్కాజిగిరి కలెక్టరేట్లను బాంబులతో పేల్చేస్తామంటూ వచ్చిన బెదిరింపు ఈ-మెయిల్స్‌తో ఒక్కసారిగా కలకలం రేగింది. కరీంనగర్‌కు చెందిన మావోయిస్టు ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు పేరిట కలెక్టర్లకు ఈ-మెయిల్స్ వచ్చాయి.
ఈ సారి మంత్రివర్గ విస్తరణలో తనకు అవకాశం వస్తుందని ఆశిస్తున్నట్లు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి తెలిపారు.
మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అనుచరులతో కలిసి తమ భూమిలోకి వచ్చి అక్కడున్న వారిపై దాడి చేయడం సరికాదని భూమి యజమానులు, శ్రీహర్ష కన్‌స్ట్రక్షన్స్ భాగస్వాములు ఆలూరి వెంకటేష్, ఆలూరి విజయభాస్కర్ అన్నారు.
మల్కాజిగిరి ఎంపీ, మాజీమంత్రి ఈటల రాజేందర్(Malkajgiri MP and former minister Etala Rajender)ను మీర్‌పేట్‌కు చెందిన బీజేపీ నేతలు, కార్పొరేటర్లతో కలిసి ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొలన్ శంకర్‌రెడ్డి సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు.
గత పాలకులు 1998 సంవత్సరంలో అరుంధతినగర్‌లో కుటుంబ నియంత్రన చేసుకున్న వారికి అప్పటి ప్రభుత్వం పట్టాలను ఇస్తే వాటిని కూల్చడం ఏమిటని మల్కాజిగిరి ఎంపీ ఈట ల రాజేందర్(Malkajgiri MP Etala Rajender) రెవెన్యూ అధికారుల తీరుపై మండి పడ్డారు.